Aaradugula Bullet Movie Review – ఆరడుగుల బుల్లెట్

Movie :- Aaradugula Bullet Review ఆరడుగుల బుల్లెట్ (2021)
Cast & Crew :- గోపీచంద్ , నయనతార , ప్రకాష్ రాజ్
Producers :- తాండ్ర రమేష్
Music Director :- మణిశర్మ
Director : – B. Gopal
Story (Spoiler Free ) :-
ఈ కథ శివ ( గోపీచంద్ ) కి తన కుటుంబం మీద ఉన్న విపరీతమైన ప్రేమని చూపిస్తూ మొదలవుతుంది. అయితే కొడుకు ఉద్యోగం లేకుండా బలాదూర్ గా ఉంటున్నాడని తండ్రి ప్రకాష్ రాజ్ కి శివ అంటే ఇష్టం కాకుండా కోపమే ఎక్కువ ఉంటుంది.
ఒకానొక సందర్భం లో శివ , నయానని (నయనతార ) ని ప్రేమిస్తాడు. విరి ప్రేమ కథ సాఫీగా సాగుతున్న సమయం లో అభిమన్యు సింగ్ , శివ తండ్రి అయినా ప్రకాష్ రాజ్ స్థలాన్ని కబ్జా చేసుకొని నానా ఇబ్బందులు పెడుతుంటాడు.
ఇదంతా తెలుసుకున్న శివ ఎలా రియాక్ట్ అవుతాడు ? అస్సలు అభిమన్యు సింగ్ కి ప్రకాష్ రాజ్ స్థలానికి సంబంధం ఏంటి ? శివ మీద ఉన్న కోపం ప్రకాష్ రాజ్ కి తగ్గుతుందా లేదా ? చివరికి శివ ఎం చేయబోతున్నాడు? ఇవ్వని తెలుసుకోవాలంటే ఈ సినిమా థియేటర్ లో చూడాల్సిందే.
Positives :-
- ఎప్పటిలాగే గోపీచంద్ తన మార్క్ నటనతో అలరిస్తారు. ప్రకాష్ రాజ్ మరియు నయనతార పాత్రలు కూడా చాల బాగా డిజైన్ చేశారు.
- ఫస్ట్ హాఫ్ మరియు యాక్షన్ సన్నివేశాలు.
- బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.
- సినిమాటోగ్రఫీ బాగుంది.
- నిర్మాణ విలువలు బాగున్నాయి.
Negatives:-
- పాత చింతకాయ పచ్చడి లాంటి కథ అయిన కధనం సరిగ్గా రాసుకోలేదు.
- సెకండ్ హాఫ్.
- దర్శకత్వం
- లాజిక్ లేస్ సీన్స్.
- ఎగ్జిక్యూషన్ అసలు బాలేదు.
- పాటలు కూడా పెద్దగా అక్కటుకోవు.
Overall :-
మొత్తానికి ఆరడుగుల బుల్లెట్ అనే సినిమా 4 ఏళ్ళ తర్వాత విడుదలైనప్పటి రొటీన్ కథ మరియు కధనం తో ప్రేక్షకులని నిరాశ చెందిస్తారు. గోపీచంద్ నటన చాల బాగుంది. ప్రకాష్ రాజ్ మరియు నయనతార పాత్రలు కూడా సినిమాకి చాల ప్లస్ అయ్యాయి. కాకపోతే రొటీన్ అనే చెప్పాలి. మ్యూజిక్ బాగుంది. యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి. కథ ఏంటనేది మొదటి భాగం లోనే చెప్పేయడం తో రెండవ భాగం మీద ఆశక్తి ఉండదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. కానీ ఈ వారం ఈ సినిమా కేవలం గోపీచంద్ కోసం ఓసారి చూసేయచ్చు.
దర్శకుడు బి.గోపాల్ గారి కం బ్యాక్ సినిమా కోసం ఎదురు చురక తప్పదు.
Rating:- 2/5