అమీర్ ఖాన్ కూతురి ప్రేమాయణం… ఎవరితో !

ప్రముఖ బాలీవుడ్ హీరో ‘అమీర్ ఖాన్ ‘కూతురు ‘ఇరాఖాన్’ మరోసారి ప్రేమలో పడిపోయారట . తండ్రి ఆమిర్ ఫిట్‌నెస్ కోచ్ ‘నుపూర్ షిఖరే’తో ఇరా ప్రేమలో ఉన్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. అంతేకాకుండా గతంలో ఇరా, మిషాల్ అనే అబ్బాయి తో ప్రేమాయాణం నడిపిన ఇరా… వాళ్లిద్దరూ కలిసి తిరిగిన ఫొటోలను ఇరా తన షోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ లు పెట్టేది. రెండేళ్ల పైగా ప్రేమించుకున్న’ ఇరా’, ‘మిషాల్’లు ఏవో కారణాల వల్ల దూరమయ్యారు .
అయితే తన పర్సనల్ విషయాలను మొహమాటంలేకుండా వెల్లడించే ‘ఇరా’ నుపూర్‌తో ప్రేమ విషయాన్ని మాత్రం రహస్యంగా ఉంచాలనుకుందంట. ‘నూపూర్ షిఖరే’ గత కొన్నేళ్లుగా ‘ఆమిర్’కు పర్సనల్ ఫిట్‌నెస్ ట్రైనర్‌గా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే.
ఇక లాక్‌డౌన్‌లో ఇరా ఫిట్‌నెస్‌పై శ్రద్ద పెట్టడంతో ‘నుపూర్’ ఆమెకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేసాడు . ఈ సమయంలో నుపూర్ వ్యక్తిత్వం ఇరా కు నచ్చడంతో తను అతడితో ప్రేమలో పడిందని తెలుస్తుంది.