Tollywood news in telugu

Aamir Khan : సోషల్ మీడియాకు దూరం కానున్న అమీర్ ఖాన్ … షాక్ కి గురవుతున్న అభిమానులు…!

Aamir Khan Quits Social Media

Aamir Khan Quits Social Media : బాలీవుడ్  హీరో అమీర్ ఖాన్ తన పుట్టినరోజు సందర్బంగా  అభిమానులు నిరుత్సాహ పడే అభిప్రాయం తీసుకున్నాడు. అమీర్  తన సోషల్ మీడియా అకౌంట్ నుండి దూరం కానున్నట్టు  ప్రకటించాడు. ఇన్ని సంవత్సరాలుగా  తనను ఆదరించిన అభిమానులకు ధన్యవాదాలు తెలియజేసాడు. ఈ విషయం తెలుసుకున్న తన అభిమానులు ఒక్క సారిగా షాక్ కి లోనయ్యారు.

 అమీర్ ఆదివారం రోజు తన 56 వ పుట్టినరోజు ను  బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయంలో కేక్ కట్ చేసి వేడుకలను జరుపుకున్నాడు. అదే సందర్భంలో . తను సోషల్ మీడియా అకౌంట్ నుండి తప్పుకుంటున్నట్టు చివరిసారిగా  ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ల ద్వారా తెలియజేసాడు.

ఈ విషయంపై  అభిమానులు నిరుత్సహానికి లోనుకావద్దని,  తాను ఎల్లప్పుడు అందరికి టచ్ లో  ఉంటానని , తన సినిమాలకు సంబంధించి  సమాచారం  ప్రొడక్షన్స్ అధికారిక సైట్‌ ద్వారా తెలియజేస్తానని వెల్లడించారు. తన   పుట్టిన రోజున అభిమానులు చూపించిన ప్రేమతో తన మనసు నిండిపోయిందని తెలిపారు.  నేను చలా సంతోషంగా ఉన్నాను. ఇక ఇదే నా చివరి పోస్ట్ అంటూ .. ఇకనుండి సోషల్ మీడియాకు దూరంగా ఉంటాను అంటూ తన పేజీ లో కామెంట్ ద్వారా తెలియజేసాడు. 

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button