సినిమా :- ఆకాశం నీ హద్దూ రా – (2020)
aakasam nee haddura movie :: సినిమా :- ఆకాశం నీ హద్దూ రా – (2020)
నటీనటులు :- సూర్య, అపర్ణ బాలమురళి, మోహన్ బాబు
మ్యూజిక్ డైరెక్టర్:- జి.వి.ప్రకాష్ కుమార్
నిర్మాతలు :- సూరియా, గునీత్ మోంగా
డైరెక్టర్ :- సుధ కొంగర
కథ:- ఈ కథ ఎన్నో సాధించాలని తపన పడే ఒక యువకుడి కథ. ఆ యువకుడు మరెవరో కాదు అతని పేరు చందా మహేష్ (సూర్య). పెద్ద పెద్ద చదువులు చదివి సొంత విమాన సంస్ధను స్థాపించాలి అని చాల కష్టపడుతూ దానికి సంబందించిన చదువు చదివి చివరికి పైలట్ అవుతాడు. కాలం గడిచే కొద్దీ మహేష్ మరియు అతని స్నేహితులు ఎప్పటినుంచో కంటున్నా లక్ష్యాన్ని సాధించడానికి వారి ఉద్యోగం వదిలేసి భారత దేశపు మొట్టమొదటి అతి తక్కువ ధర విమాన సంస్ధ డెక్కన్ ఎయిర్ ను ప్రారంభించడానికి కృషి చేస్తారు. ఈ క్రమంలో వారు పడిన ఇబ్బందులు ఏంటి? ఎవరు వారిని అడ్డుపడుతున్నారు? చివరికి వారు అనుకున్నది సాధించారా లేదా అని తెలుసుకోవాలంటే సినిమా చూసేయాల్సిందే.
* సూర్య ఎప్పటిలాగే సినిమా లో ప్రతి సన్నివేశంలో తనదయిన ముద్రని చూపించారు.
* సినిమాకి సంబంధించిన ప్రతి ఒక క్యారెక్టర్ తమ తమ పాత్రకి న్యాయం చేసారు.
* కథ , కధనం చక్కగా వ్రాసుకున్నారు.
* దర్శకురాలు తాను చుపించాలనుకుంది ఎక్కడ తగ్గకుండా సైడ్ ట్రాక్ లేకుండా చూపించింది.
* బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొత్తగా ఉంది.
*సినిమాటోగ్రఫీ చాలా బాగుంది.
* ప్రొడక్షన్ విలువలు కూడా చాలా బాగున్నాయి.
* సినిమా అక్కడక్కడా నిదానంగా సాగుతుంది.
ముగింపు :-
మొత్తానికి ఆకాశమే ని హద్దురా అనే చిత్రం అని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది అనే విషయం లో ఎలాంటి సందేహం లేదు. సూర్య ఎప్పటిలాగే సినిమా లో ప్రతి సన్నివేశంలో తనదయిన ముద్రని చూపించారు. ఎన్ని రోజులునుంచో మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న సూర్య అభిమానులకి ఈ చిత్రం అంకితం. మిగితా నటీనటులు తమదయినా శైలి లో చిత్రంలో కనువిందు చేసారు. సినిమాలో కామెడీ సన్నివేశాలు ఉండవు సీరియస్ గ సాగుతుంది. కెమెరా పని తీరు బాగుంది. నిర్మణ విలువలు ప్రతి ఫ్రేమ్ లో కనబడుతుంది. దర్శకురాలు తాను చుపించాలనుకుంది ఎక్కడ తగ్గకుండా సైడ్ ట్రాక్ లేకుండా చూపించింది. మొత్తానికి వన్ మ్యాన్ షో. విమానం పర్ఫెక్ట్ గా ల్యాండ్ అయింది.
రేటింగ్ :- 2.5/5