News

aakaasam nee haddhu ra : ఆస్కార్ బరిలో దూసుకెళ్తున్న మూవీ …. ఆకాశం నీ హద్దురా.. !

aakaasam nee haddhu ra

aakaasam nee haddhu ra : ఆకాశం నీ హద్దురా సినిమాను సుధ కొంగర ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఇపుడు ఈ మూవీ  ఆస్కార్ అవార్డుని పొందేందుకు బరిలోకి దూసుకెళ్లింది. ప్రపంచంలోని రకరకాల దేశాల్లో, పలు భాషల్లో తెరకెక్కిన 366 చిత్రాలు 93వ ఆస్కార్‌‌‌‌ అవార్డుల రేస్‌‌లో నెక్స్ట్​ లెవెల్​కి వెళ్లాయంటూ ‘ద అకాడెమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’ శుక్రవారం రివీల్ చేసింది. అందులో  సూర్య సినిమా ఉండటం చిత్ర యూనిట్ ని సంతోషంలో మునిగి తేలుతున్నారు.

 ఎయిర్‌‌‌‌ డెక్కన్ అధినేత జీఆర్ గోపీనాథ్‌‌ జీవితం ఆధారంగా తీసిన ఈ మూవీ బెస్ట్‌‌ ఫీచర్​​ ఫిల్మ్‌‌గా లిస్టులోకి ఎక్కింది. ఈ సినిమాలో  సూర్య, అపర్ణలు బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్ కేటగిరీల్లో పోటీలో నిలిచారు. నిజంగా చాలా థ్రిల్లింగ్‌‌గా ఉందంటూ సూర్యకి చెందిన 2డి ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్స్ సంస్థ తెలియజేసింది. వచ్చే నెల  మార్చ్​ 5 నుంచి 10 వరకు అకాడెమీ ఓటింగ్ జరగనుంది. అదేవిదంగా  మార్చ్ 15న నామినేషన్స్​ని అనౌన్స్ చేయనున్నారు. 

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button