Tollywood news in telugu

ఫారెన్సిక్ డాక్టర్ గా థ్రిల్ చేయబోతున్న ఆది సాయికుమార్ !!!


ఫారెన్సిక్ డాక్టర్ గా థ్రిల్ చేయబోతున్న ఆది సాయికుమార్

హీరో ఆది సాయికుమార్ కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు రెడీ అవుతున్నాడు . పుట్టిన రోజు సందర్భంగా కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కబోతున్న చిత్రం కాన్సెప్ట్ లుక్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. అవుట్ అండ్ అవుట్ క్రైమ్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళ బోయే ఈ థ్రిల్లర్ లో ఆది ఒక ఫారెన్సిక్ డాక్టర్ గా థ్రిల్ చేయబోతు్న్నాడు. మరుధూరి ఎంటర్ టైన్మెంట్స్, చాగంటి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించే ఈ చిత్రానికి నిర్మాతలు మరుధూరి వినోద్, చాగంటి శాంతయ్య.
ఈ మూవీ లో ఆది ఒక కొత్త్ పాత్రలో పరిచయం కాబోతున్నాడు.
శివ శంకర్ దేవ్ ఈ చిత్రం తో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఆద్యంతం ప్రేక్షకుల్ని థ్రిల్ చేసే అంశాలతో స్ర్కిప్ట్ ని పకడ్బందీగా రెడీ చేసిన దర్శకుడు శివ శంకర్ దేవ్ ఈ చిత్రంలో ఇప్పటి వరకూ తెలుగులో రాని కొత్త కాన్సెప్ట్ ని తెరమీద చూపించబోతున్నాడు.
త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళే ఈ చిత్రంలోని ఇతర పాత్రల వివరాలు త్వరలోనే తెలియజేస్తారు.

బ్యానర్స్:
మరుధూరి ఎంటర్ టైన్మెంట్స్
చాగంటి ప్రొడక్షన్స్
నిర్మాతలు : మరుధూరి వినోద్, చాగంటి శాంతయ్య.
డైరెక్టర్ : శివశంకర్ దేవ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: ఎమ్. సాయికిరణ్, ప్రతాని శ్రీనివాస్ గౌడ్, అనీల్ మైలాపురమ్, పి.ఆర్.ఓ. జియస్ కె మీడియా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button