Tollywood news in telugu

a1 express movie review : A1 ఎక్స్ప్రెస్ మూవీ రివ్యూ…!

a1 express movie review

నటీనటులు : సుందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి, మురళీ శర్మ, ప్రియదర్శి, రావు రమేష్,  రాహుల్ రామకృష్ణ

దర్శకత్వం : డెన్నిస్ జీవన్ కనుకొలను

నిర్మాత‌లు : అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, టి. జి. విశ్వ ప్రసాద్,  దయా పన్నెం

సంగీతం : హిప్ హాప్ తమీజా

ఈ రోజు  “ఏ1 ఎక్స్ ప్రెస్” బారి అంచనాల మధ్య విడుదల అయింది . ఇది   డెన్నిస్ దర్శకత్వంలో తెరకెక్కిన కొత్త మూవీ. ఇందులో సందీప్ కిషన్ హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించారు. ఈ మూవీ ఎమోషనల్ స్పోర్ట్ కథాంశంతో సాగుతుంది.

ఇక కథ విషయానికి వస్తే…

 యానాం లోని ఓ హాకీ గ్రౌండ్ కు సంబంధించి కథ స్టార్ట్ అవుతుంది. యానాం  లోకల్ లో ని బలమైన రాజకీయ పార్టీ కి చెందిన నాయకుడు , ఈ గ్రౌండ్ ల్యాండ్ పై కన్నేసి దానిని దక్కించుకోవాలని చూస్తాడు. తరవాత ఆ ప్లేస్ ని అమ్మి సొమ్ముచేసుకోవాలని చూస్తాడు. ఈ సినిమాలో మరో పక్క,  సంజు(సందీప్ కిషన్) లావ్(లావణ్య త్రిపాఠి) అనే ఓ హాకీ ప్లేయర్ ను తన లవ్ లో పడేసే ప్రయత్నం చేస్తాడు. ఈ తరుణంలో  కొన్ని ఊహించని సంఘటనల ద్వారా సంజు ఆ గ్రౌండ్ ను కాపాడాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితిలో సంజు కి ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి. ఎలాంటి ట్విస్టులు విలన్ కి ఇస్తాడు.  అసలు సంజూ బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనే అంశాలను ఆధారంగా చేసుకొని  స్టోరీ సాగుతుంది. మరి వీటికి సంబంధించి తెలుసుకోవాలంటే  వెండితెర పై చూడాల్సిందే.

బెస్ట్ పాయింట్స్ విషయానికి వస్తే… 

ముందుగా  నటీనటుల పెర్ఫామెన్స్ విషయాన్ని చుస్తే..  సందీప్ కిషన్ ఈ సినిమాలో తన నటన పరంగా ప్రజలను మెప్పించాడు. ఇతని తపన సినిమాలో కనిపిస్తుంది.  ఒక స్పోర్ట్స్ పర్సెన్ లాగే ఫీలింగ్స్ ని పండించాడు. అందులో ఎమోషన్స్, స్యాడ్ , సంతోషాన్ని , ఆటిట్యూడ్ , ఎంతో చక్కగా చూపించాడు. ఇందులో  భావోద్వేగ సన్నివేశాల్లో అందరిని  సందీప్ ఏడిపించేసాడు. అలాగే మంచి ఫిజిక్ ని మెయింటైన్ చేసాడు.

ఇక  రావు రమేష్ విషయానికి వస్తే..  ఇప్పటి వరకు ఈయన ఎన్నో సినిమాలలో మంచి పత్రాలు చేసాడు. అలాగే సినిమాను మలుపుతిప్పే ముఖ్యమైన రోల్స్ చేసారు.   ఈ సినిమాలో  కూడా ఒక  పొలిటీషియన్ గా సినిమా మొదటి నుంచి ఎండింగ్ వరకు తన నటనతో వెండి తెరపై నవ్వుల్నీ పంచాడు. అదేవిదంగా  తన డైలాగ్ లతో వేడిని కూడా పుట్టించాడు.

ఇక  మరో  నటుడు మురళీ శర్మ , ఇతను ఈ సినిమాలో హాకీ కోచ్ గా మంచి పాత్రను పోషించాడు.  ఇక లావణ్య త్రిపాఠి విషయానికి వెళ్తే.. గ్లామరస్ తో పాటు ఒక  స్పోర్ట్స్ ఉమెన్ గా తన పాత్ర కు న్యాయం చేసింది.  తనకి సందీప్ కు మధ్య కొన్ని ఎమోషన్స్, రొమాంటిక్ సీన్స్ వంటి వాటితో , చూసే జనానికి మతి పోగొట్టాయి. అదేవిదంగా  ఈ స్పోర్ట్స్ లో  కార్పొరేట్ పాలిటిక్స్ జరుగుతాయి. ఇందులో ఒక  ఇంట్రెస్టింగ్ పాయింట్ ప్రేక్షకులను ఆలోచనలో పడేస్తుంది.  అలాగే కథానుసారం వచ్చే ట్విస్ట్ కానీ అక్కడక్కడా కామెడీ సీన్స్ కానీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

విజువల్స్ ఎఫెక్ట్ విషయానికి వస్తే…

ఇక ఇలాంటి  స్పోర్ట్స్ కి సంబందించిన సినిమాలో  విజువల్స్ చాలా ముఖ్యం వీటి ద్వారానే  ఒక నిజమైన మ్యాచ్ చూసిన అనుభవం ప్రేక్షకులకు  కలుగుతుంది.   క్లైమాక్స్ మ్యాచ్ అయితే ఒక పక్క టెన్షన్ ని పెట్టిస్తూ…  అద్భుతమైన విజువల్స్ తో చూపించారు .

సినిమాలో మైనస్ పాయింట్స్ ఏంటంటే…

 స్పోర్ట్స్ సినిమా అంటే  ఆ స్పోర్ట్స్ పర్సెన్ ను  ఇన్స్పైరింగ్  చేసే అంశాలు ఎక్కడ కనిపించవు. ఫస్ట్ హాఫ్ మొత్తం మామూలుగానే సాగుతుంది. చిన్న చిన్న ట్విస్ట్ లు తప్ప ఏమి అంతగా ఉండవు. కొన్ని రోల్స్ లలో నటులు వేరేవారిని పెడితే బాగుందేమో అనిపిస్తుంది. రెండు టీమ్స్ మధ్య ఇంకాస్త గట్టి పోటీ ఉంటె బాగుండేది అనిపిస్తుంది.

 ఫైనల్ గా ఈ సినిమాను ఈ వారం టైం పాస్ కోసం చూడొచ్చు.

Tags

Leave a Reply

Your email address will not be published.

Back to top button