క్రైం సీరియల్స్ చూస్తూ….హత్యలకు పాల్పడుతున్న యువకుడు !

crime news నేరాలకు గోరాలకు పాల్పడే వ్యక్తులు, చేసే పనులు చేస్తూ తమకేమి తెలియనట్టు జనాల మధ్య తిరుగుతూ, ఎవరికి అనుమానం రాకుండా జాగ్రత్తలు పడుతూ ఉంటారు.
కానీ నిజం నిప్పులాంటిది అంటారు. ఇప్పుడు కాకపోతే రేపు అయినా బయటికి రావలసిందే. ఇదే జరిగింది ఉత్రప్రదేశ్ లో, కన్న కొడుకే తన తండ్రిని దారుణంగా హత్య చేసాడు.
విషయానికి వెళ్తే ఉత్తరప్రదేశ్ కి చెందిన 40 ఏళ్ల మనోజ్ మిశ్రా ఇస్కాన్ నో ఉంటూ విరాళాలు సేకరిస్తూ ఉండేవాడు. కొన్ని నెలలక్రితం మనోజ్ తన 15 సంవత్సరాల కొడుకుని ఎదో విషయంలో మందలించాడు.
ఈ విషయం లో తండ్రి పై కోపం పెంచుకున్న కొడుకు, తండ్రి నిద్రిస్తున్న సమయంలో ఒక ఇనుపరాడ్ తో కొట్టి చంపాడు.
ఈ విషయం తెలుసుకున్న తల్లి తన కొడుకుని కాపాడటానికి తన భర్త మృతదేహాన్ని ఊరి అవతలకి తీసుకెళ్లి దహనం చేసింది.
ఆ శవం సగం కలడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, దర్యాప్తులో కొడుకు క్రైం సీరియల్ చూసి హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు.