News

31 సార్లు కరోనా…

మనం ఒకసారి కరోనా వస్తేనే లబోదిబోమంటూ… ఆందోళనకు గురవుతారు..కానీ ఒక చోట ఒక మహిళకు 31 సార్లు కరోనా పాజిటివ్ వచ్చిదట..

రాజస్థాన్ రాష్ట్రంలోని అప్నఘర్ ఆశ్రమానికి చెందిన శారదా అనే మహిళ ….ఆగస్ట్ 31న భరత్పూర్ జిల్లాలోని ఆర్ బి ఎం ఆస్పత్రిలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా పాజిటివ్ రావడంతో.. ఆ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతుంది. ఈ విధంగా కొన్ని రోజుల తర్వాత వైద్యులు మళ్లీ పరీక్ష నిర్వహించగా.. మళ్లీ పాజిటివే వచ్చింది..

అలాగే ఇప్పటి వరకు 31 సార్లు కరోనా పరీక్షలు నిర్వహిస్తే ప్రతి దాంట్లో పాజిటివ్ రావడంతో వైద్యులు అవాక్కయ్యారు. ఒక మహిళకు ఎలాంటి కరోనా లక్షణాలు లేకుండా ఇన్ని సార్లు కరోనా పాజిటివ్ రావడం ఏంటని వైద్య అధికారులు తలలు పట్టుకున్నారు

Read  కాణిపాకం దేవస్థానానికి ఏకంగా 7కోట్లు విరాళమిచ్చిన భక్తుడు...!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button