Today Telugu News Updates

ఆన్ లైన్ క్లాసులకు సెకండ్ హ్యాండ్ ఫోన్ కొని… చిక్కుల్లో పడ్డ మహిళా !

online classes

తన కొడుకు ఆన్ లైన్లో   పాఠాలు వినేందుకు ఓ తల్లి సెకండ్ హ్యాండ్ ఫోన్ కొని చిక్కుల్లో పడిపోయింది. ఈ ఘటన ముంబైలోని బొరివిలీ ప్రాంతానికి చెందిన స్వాతి అనే మహిళా తన కొడుకు ఆన్ లైన్ తరగతులు ఎక్కడ మిస్సవుతాడోనని తాను దాచుకున్న డబ్బులతో సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనిచ్చింది.

ఈ ఫోన్ లో సిమ్ వేసి కొద్దిరోజులు అయ్యిందోలేదో పోలీసులు తన ఇంటికి వచ్చి స్వాతిని పోలీసు స్టేషన్ కి తీసుకెళ్లి విషయం ఆరా తీయగా, అసలు విషయం బయట పడింది.

స్వాతి ఆ ఫోన్ ని కొనడానికి 3 నెలలు కస్టపడి దాచుకున్న డబ్బుతో కొన్నానని, ఆ ఫోన్ బయట రోడ్డు పక్కన కొన్నానని, పోలీసులకు తెలిపింది. స్వాతి చెప్పే సమాదానాలు విని ఈ ఫోన్ చోరీ కి గురి అయిన ఫోన్ అని ఆ మహిళకి తెలిపారు.

 ఫోన్ చోరీ కి స్వాతి కి ఏ సంబంధం లేదని తెలుసుకున్న పోలీసులు ఆ మహిళకు ఒక కొత్త ఫోన్ ని బహుమతి గా అందించారు.

తన పరిస్థితిని అర్థం చేసుకొని నాకు ఫోన్ కొనిచ్చినందుకు పోలీసులకు స్వాతి కృతఙ్ఞతలు తెలిపింది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button