Today Telugu News Updates

Ratan Tata: రతన్ టాటానే మస్కా కొట్టిన ఓ మహిళ…

ప్రముఖ దిగ్గజ వ్యాపార వేత్త రతన్ టాటా కారు నెంబర్ నే ఓ మహిళ గత కొద్ది సంవత్సరాలుగా వాడుకుంటూ.. రతన్ టాటా కె మస్కా కొట్టింది.

రతన్ టాటా (ఎంహెచ్01 డికె 0111) కార్ పై నిబంధనలను ఉల్లంఘించినందుకు చలాన్లు రావడంతో
టాటా సన్స్ ఉద్యోగులు అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ వాహనం ముంబై కి చెందిందని సీసీ కెమెరాల ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు. ఈ డూప్లికేట్ నెంబర్ పెట్టుకొన్న గీతాంజలి సామ్ షా అనే మహిళను పట్టుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తనకు ఈ నెంబర్ రతన్ టాటా దాని తెలీదని, అలాగే ఈ నెంబరు పెట్టుకోమని ఓ ప్రముఖ న్యూరాలజిస్ట్ సూచించినట్లు ఆ మహిళ పోలీసులకు తెలిపింది. ఈ నెంబర్ కార్ ప్లేట్ గా పెట్టుకుంటే మంచి స్థాయికి ఎదుగుతావని న్యూరాలజిస్ట్ చెప్పడంతో తను ఈ పనిచేశానన్ని గీతాంజలి చెప్పింది. ఎవరు నకిలీ నెంబర్ ప్లేట్ లను ఉపయోగించ వద్దని… ఉపయోగిస్తే కఠిన చర్యలు తప్పవని ముంబై పోలీసులు హెచ్చరించారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button