మహిళా క్రికెటర్స్ ఏ మాత్రం తక్కువకాదని నిరూపిస్తున్న….. వైరల్ వీడియో !

తాజాగా సిడ్నీ లో జరిగిన క్రికెట్ చుస్తే మహిళా క్రికెటర్స్ ఆడుతున్న వైనం చూస్తూఉంటే పురుషులకు వీరు ఏమాత్రం తీసిపోరు అని తెలుస్తుంది.
మహిళా క్రికెటర్స్ కి పురుషులతో పోల్చితే ఆదరణ కాస్త తక్కువనే చెప్పాలి, మన ఇండియా లోనే కాదు అన్ని దేశాలలో ఇదే పరిస్థితి. ఐనకాని ఏలాంటి నిరుత్సాహానికి లోనుకాకుండా మహిళలు వారి ఆటకు పదునుపెడుతూ ప్రజల దృష్టిని వారి వైపుకు మళ్లించుకుంటున్నారు.
శనివారం సిడ్నీ లో బ్రిస్బేన్ హీట్ ఉమెన్, అడిలైడ్ స్ట్రయికర్స్ ఉమెన్ మధ్య మ్యాచ్ ఎంతో రసవత్తరంగా సాగింది. బ్రిస్బేన్ హీట్ ఉమెన్ టీమ్ విజయానికి 17 బంతుల్లో 35 పరుగులు చేసే తరుణంలో గ్రౌండ్‌లో కళ్ళను కట్టిపడేసే అద్భుతం చోటుచేసుకుంది.
ఒక ఫుల్ టాస్ బంతిని అమెలియా కేర్ మిడ్ భారీ షాట్ కొట్టింది. ఆ బల్ కచ్చితంగా బౌండరీ దాటుతుందని అందరు అనుకొనే సమయంలో, ఆ బంతిని ‘మ్యాడీ పెన్ని’ క్యాచ్ పట్టే ప్రయత్నం చేసింది. ఆమె చేతులను తాకుతూ బంతి పైకి లేచి.. కొంత దూరంలో కిందపడబోయే సమయంలో పెన్నికు బ్యాకప్‌గా వచ్చిన ‘తాహిలా మెక్‌గ్రాత్’ కళ్లు చెదిరేలా డైవ్ చేస్తూ బాల్‌ను పట్టుకుంది.
ఈ అద్భుతం చుసిన క్రికెట్ అభిమానులు ‘తాహిలా మెక్‌గ్రాత్’ కు ఫిదా అయిపోయారు.
ICYMI: You're really going to want to see this 🤯☝️ #BlueEnergy #WBBL06 pic.twitter.com/lcpZBFhew3
— AdelaideStrikersWBBL (@StrikersWBBL) November 7, 2020