Tollywood news in telugu

A Typical Multi Starrer by Star Actresses on the way : మొట్టమొదటిసారి ఇద్దరు హీరోయిన్లు కలిసి మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నారు :-

A Typical Multi Starrer by Star Actresses on the way

A Typical Multi Starrer by Star Actresses on the way : అవును మీరు చదివింది నిజమే. ఇద్దరు స్టార్ హీరోయిన్లు కలిసి మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నారు. ఇన్నిరోజులు మనం స్టార్ హీరోయిన్లు ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చేయడం చూసాము కానీ ఇలా ఇద్దరు కలిసి సినిమా చేయడం ఇదే మొదటిసారి. దానికితోడు సినిమా టైటిల్ తోనే ప్రేక్షకులని వారి సినిమా వైపు తిప్పుకున్నారు.

మ్యాటర్ లోకి వెళ్తే సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు గారి నిర్మాణం లో సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన సినిమా శాకినీ డాకిని. ఈ సినిమా టైటిల్ వినగానే ఎదో దెయ్యాల సినిమా అనుకునేరు. అస్సలు కాదు ఈ సినిమాలో నటించే స్టార్ హీరోయిన్ల సినిమా లోని పేరు అది. ఇంతకీ ఆ హీరోయిన్లు ఎవరు అనుకుంటున్నారా.

ఇదివరకే విశాల్ చక్ర సినిమా లో లేడీ విలన్ గా చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేసి తన నటనకి ప్రశంశలు పొందిన హీరోయిన్ రెజినా ఒక వైపు , కంటెంట్ సినిమాలు చేస్తూ వరుస విజయాలు దక్కించుకున్న నివేత థామస్ ఇంకోవైపు. ఇప్పుడు మీకు మ్యాటర్ అర్ధం అయింది అనుకుంట.

నివేత థామస్ మరియు రెజినా కలిసి చేసిన మల్టీ స్టారర్ సినిమానే శాకినీ డాకిని. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తిచేసుకొని త్వరలో విడుదల తేదీ ప్రకటించనున్నారు. మొట్టమొదటి సారి ఇద్దరు స్టార్ హీరోయిన్లు కలిసి ఇలాంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమా చేయడం ఇండస్ట్రీ లో కొత్త స్క్రిప్ట్స్ కి నాంది పలకబోతుంది. చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో.

Tags

Leave a Reply

Your email address will not be published.

Back to top button