News

మహిళా సంఘాల ఆగ్రహానికి గురి ఐన సీనియర్ నటుడు !

shaktimaan Mukesh Khanna

‘మీటూ ఉద్యమం గురించి అంద‌రికీ తెలిసిందే. ముఖ్యంగా చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో లైంగిక వేధింపుల‌పై ఎప్పుడూ విమ‌ర్శ‌లు వ‌స్తూనే ఉన్నాయి. ఓ ఉద్య‌మంలా మీడియాలో  చ‌ర్చ జ‌రుగుతున్న‌ప్పుడు మాత్రం ఓదార్పు మాట‌లేవో చెప్ప‌డం, ఆ త‌ర్వాత స‌ర్దుకుపోవ‌డం చూస్తున్నాం.

ఈ నేప‌థ్యంలో ‘మీటూ ఉద్యమంపై బాలీవుడ్ సీనియ‌ర్ హీరో ముఖేశ్ ఖ‌న్నా  కోరికోరి వివాదాన‌ని మీదికి తెచ్చుకున్నాడు.

సమాజంలోని ప్రతి అంశంలో తామూ మ‌గ‌వాళ్ల‌తో సమామని అనుకోవడం  వల్లే మహిళలు లైంగిక హింసకు గురవుతున్నారు. ఎప్పుడైతే ఆడవాళ్లు బయటకొచ్చారో అప్పటి నుంచే `మీటూ` మొదలైంది.

`మీ టూ` ఉద్యమానికి  మహిళలలే బాధ్యత వహించాలి. వారు పురుషులతో భుజం భుజం రాసుకు తిరగకుండా ఇంటి ఉంటె  మంచిది ’ అని  ముఖేష్ సలహా ఇచ్చాడు. 

లైంగిక వేధింపుల‌కు ఆడ‌వాళ్లే బాధ్య‌త అన్న‌ట్టు ముఖేశ్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డంతో మ‌హిళా సంఘాలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా ముఖేశ్‌పై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు.

ఈ విష‌యాన్ని తెలుసుకున్న ముఖేశ్ దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టారు.

నా ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. మహిళలను కించపరచడం ఎంత మాత్రం నా ఉద్దేశం కాదు. మ‌హిళ‌ల‌ను గౌర‌వించ‌డంలో ఎప్పుడూ నేను ముందు వ‌రుస‌లో ఉంటా. నా వ్యాఖ్యల వల్ల బాధపడిన వారందరికీ క్షమాపణలు చెబుతున్నా అని  ముఖేష్ పేర్కొన్నాడు. 

ఈ విదంగా ముకేశ్ మహిళల ఆగ్రహానికి గురి అయ్యాడు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button