Tollywood news in telugu

చిట్టి గౌను వేసుకున్నందుకు ఘర్షణ

rashmi gautam instagram photos

rashmi gautam instagram photos : యాంకర్ రష్మీ షోషల్ మీడియాలో ఏది పోస్ట్ చేసిన అదో హాట్ టాపిక్ గా వైరల్ అవుతుంది. అంతటి క్రేజ్ సంపాదించుకున్న బుల్లి తేరా యాంకర్ రష్మీ గౌతమ్. ఈమెకు  సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ అంతాఇంతాకాదు , తనని ఏ చిన్న మాటన్నా రియాక్ట్ అయ్యేవాళ్ళు చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. జబర్దస్త్  కామెడీ షో ద్వారా యాంకర్‏గా మంచి గుర్తింపు తెచ్చుకున్న  రష్మీ.. ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ టీవీ షోలను కూడా కంటిన్యూ చేస్తుంది. ఇక అటు మూవీస్, ఇటు బుల్లితెర షో లలో ఎంత తీరికలేకున్నా… షోషల్ మీడియాలో చాల యాక్టీవ్ గా ఉంటుంది.

రష్మీ తనకు ఎదురైనా విషయాలను, తాను చేయబోయే కొత్త ప్రాజెక్టు ల గురించి, తాను చేసే మంచి పనుల గురించి, అలాగే ఎదుర్కుంటున్న సమస్యల గురించి తన అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటుంది. ఇక తన గురించి తెలిసిన వారు పాజిటివ్ గా స్పందిస్తే, తెలియని వారు నెగెటివ్ కామెంట్స్ తో ఇబ్బందికి గురిచేస్తూ ఉంటారు. ఈ నెగెటివ్ కామెంట్స్ ని రష్మీ పట్టించుకోకపోయినా, తన ఫాన్స్ మాత్రం ఘాటుగానే స్పందిస్తూ తిట్ల యుద్ధం చేస్తూ ఉంటారు.

rashmi gautam instagram photos

తాజాగా రష్మీ గౌతమ్  గ్రే కలర్‏లో చిట్టి గౌన్‏తో ఫోటోలకు ఫోజులిచ్చింది , ఈ ఫోటోలను తన instagram లో పోస్ట్ చేసింది. ఇక రష్మిని ఫాలోఅవుతున్న వారు ఊరుకుంటారా… వారి ఫోన్ లకు పని చెప్పి,తాను వేసుకున్న డ్రెస్ గురించి సమాజానికి ఏంచెప్పాలనుకుంటున్నారు, మీలాంటి వారి వల్లే యువత తప్పుదోవ పడుతున్నారు అంటూ పెద్ద రచ్చే జరిగింది.

అదేవిదంగా రష్మీ ఫోటోస్ చూసిన ఓ నెటిజన్.. రోజు రోజూకి స్టెప్ డౌన్ అవుతున్నారంటూ.. కామెంట్ చేశాడు. ఇక ఆ కామెంట్‏కు మరో నెటిజన్ బదులిస్తూ… ఆ ఫోటోలు మరీ అంత దారుణంగా లేవు .. ఎందుకు అంత నెగిటివ్ గా ఆలోచిస్తున్నావు అని తెలిపాడు. ఇలా వీరి మాటల యుద్ధం చిలికి చిలికి గాలివానలా మారి పెద్ద రభసే జరిగింది షోషల్ మీడియాలో.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button