News
7వ పెళ్లికి సిద్ధమైన 63 ఏళ్ళు వృదుడు..

ఈ రోజుల్లో వయసులో ఉన్న అబ్బాయిలకు పెళ్లి చేసుకుందాం అంటే ఒక అమ్మాయి కూడా దొరకడం లేదు అలాంటిది ఒక అరవై ఏళ్ల వృద్ధుడు ఆరు పెళ్లి చేసుకుని ఏడో పెళ్లి కూడా సిద్ధమయ్యాడాటా…!
గుజరాత్ రాష్ట్రంలోని సూరత్‌కు చెందిన ఓ ధనిక రైతు ఆరుగురిని పెళ్లాడడు.. ఇప్పుడు మరో పెళ్లి కి కూడా తయారుగా ఉన్నాడు. అసలు విషయం ఏంటంటే.. గతేడాది డిసెంబర్ లో తను పెళ్లి చేసుకున్న 6వ భార్య కరోనా కారణంగా శారీరకంగా కలవడానికి నిరాకరించడంతో..ఆ ధనిక రైతు ఆమెతో తెగదెంపులు చేసుకున్నాడు.
ఈ మేరకు తనకు డయాబెటిస్, గుండె సంబంధించిన పలు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని.. అందుకే తనకు తోడు కావాలని మరో పెళ్లి చేసుకోబోతున్నట్లు ధనిక రైతు చెపుతున్నాడు. ఇక తన 6 వ భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయన రాసలీలలు గుట్టు రట్టయింది.