మూడో అంతస్తు నుంచి పిల్లల్ని విసిరేసిన తల్లి..వారి మంచికోసమేనట…వైరల్ ఫోటో.. !

మూడో అంతస్తు నుంచి పిల్లల్ని విసిరేసిన ఘటన టర్కీ లో చోటుచేసుకుంది. అగ్ని ప్రమాదం కి గురిఅయిన తన అపార్ట్ మెంట్ లోనుండి తన నలుగురు పిల్లల్ని రక్షించుకునేందుకు ఒకరి తరువాత ఒకరిని ఆ తల్లి అపార్ట్మెంటు మూడో అంతస్తు నుంచి కిందకు జారవిడిచింది.
ఆ సమయంలో కింద ఉన్న కొంత మంది వ్యక్తులు ఒక వెడల్పు లాంటి జాలిని పట్టుకొని కాపాడారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కొందరు వారి ఫోన్ లలో బందించి షోషల్ మీడియాలో వదిలారు.
ఈ దారుణమైన ఘటన టర్కీ రాజధాని ఇస్తాంబుల్లో జరిగింది. సదరు మహిళ నివసిస్తున్న ఫ్లాట్ ద్వారం నుంచి వారు బయట పడే అవకాశంలేక , మంటలు ఎక్కువవుతున్న సమయంలో ఆమె తన పిల్లలను ఇలా కిందకు జారవిడిచింది.
స్థానికులు సమయస్ఫూర్తితో వ్యవహరించి పిల్లల ప్రాణాలను కాపాడారు. పిల్లల తరవాత ఆ తల్లి కూడా అదే కిటికీ నుండి దూకి తన ప్రాణాలను కూడా రక్షించుకుంది. ఇందంతా స్థానికుల వల్ల సాధ్యపడింది.