మిక్చర్, టీతోనే కడుపు నింపుకుంటున్న వైనం …. ఇవి కాదని వేరే ఏది తిన్న జరిగేది ఇదే … !

మనం తినే మూడు పుటల్లో ఏ ఒక్కటి మిస్ అయినా అల్లాడి పోతాం. ఇక ఉపవాసాలు ఉన్నవారు ఏంచేస్తారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . అలాంటిది ఒక బాలిక తన చిన్నప్పటినుండి అన్నం తినడం మానేసింది. కేవలం చిరుతిళ్ళు తింటూ బ్రతికేస్తుంది.
మరి వారి తల్లిదండ్రలు ఏంచేస్తున్నారు అనేకదా మీ ప్రశ్న… అక్కడికే వస్తున్నాను , భద్రాద్రి కొత్తగూడెం లోని బెండలపాడు అనే గ్రామానికి చెందిన పోడియం రాధాకృష్ణ, అరుణ దంపతులకు పుట్టిన కూతురు నాగేంద్ర (15), ఈమె ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతుంది. నాగేద్రకు చిన్నపుడు రాధాకృష్ణ చిరుతిళ్ళు కొనిచ్చేవాడు,అలాగే వారి ఇంటికి వచ్చే బంధువులు కూడా అవే తీసుకొచ్చేవారు.
నాగేద్ర ఈ చిరుతిళ్ళకు అలవాటుపడి , చప్పగా ఉండే అన్నాన్ని ముట్టుక పోయేది, ఎపుడైనా బలవంతంగా అన్నం తినిపిస్తే వాంతులు చేసుకునేది. ఈ బాలిక తల్లిదండ్రలు ఎప్పుడు అన్నం తినిపించిన వాంతులు చేసుకోవడంతో , ఎదో ఒకటి తినకుంటే బిడ్డ కడుపు మాడుతుందని మిక్చర్ తిన్నగాని ఏమనకుండే ఉండేవారు. ఆలా మొదలైన ఈ అలవాటు ఇప్పటికి 14 ఏళ్ళు గడుస్తున్నా , ఈ బాలిక అన్నం మాత్రం తినడంలేదు.
ఇలా ఈ బాలిక మిక్చర్ తిన్నప్పటికీ ఆరోగ్యాంగానే ఉంటుందని రాధాకృష్ణ చెబుతున్నాడు.