Tollywood news in telugu

హీరో ప్రభాస్ పేరిట మోసానికి పాల్పడ్డ ముఠా !

A gang that committed fraud in the name of hero Prabhas

సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టడం ఒక కళ , ఒక చిన్న క్యారెక్టర్ ఎవరైనా ఇస్తే చాలు అని అనుకొనే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇక ప్రభాస్ తో నటించే అవకాశం ఇస్తానంటే ఊరుకుంటారా.. ఎన్ని లక్షలు ఇచ్చయిన సరే ప్రభాస్ పక్కన ఛాన్స్ కొట్టాలని చూస్తారు.

ఇలాంటి వీక్నెస్ ఉన్నవాళ్లను కొంతమంది క్యాష్ చేసుకోవాలని చూస్తారు. ఇక్కడకూడా అదే జరిగింది.  ఒక ప్రొడక్షన్ పేరుతో కొంతమంది కలిసి, ప్రభాస్ తో నటించే అవకాశం కల్పిస్తామని చెప్పి నమ్మబలికారు. దీనికిగాను కొంత అమౌంట్ కట్టాల్సి ఉంటది అని చెప్పడంతో, అదినమ్మిన కొంతమంది 5 నుండి 10 వేయిల రూపాయలు కట్టారు.

ఇలా డబ్బులు కట్టినవాళ్లకు మీకు మెసేజ్ వస్తుంది. వచ్చిన తరువాత మమ్మల్ని కలవండి అని చెప్పి పంపించారు. ఎన్ని రోజులు గడుస్తున్నప్పటికీ మెసేజ్ రాకపోవడంతో ప్రొడక్షన్ హౌస్ కి వెళ్లి చుస్తే ఎవరు లేకపోవడంతో మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు.

విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తుచేస్తున్నారు. ఇలాంటి మోసాలు ముంబై లో ఎక్కువగా జరుగుతూఉంటాయి . ఇలాంటివారిని నమ్మి మోసపోవద్దని ప్రజలకు పోలీసులు తెలిపారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button