Tollywood news in teluguViral news in telugu

సచిన్, సెహ్వాగ్, యువీ ల మధ్య జరిగిన నవ్వులు తెప్పించే సంభాషణ.. వీడియో వైరల్…!

A funny conversation between Sachin, Sehwag and Yuvraj

టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజం  స‌చిన్ టెండూల్క‌ర్ వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ ఆసక్తికర సంఘటనను  సెహ్వాగ్ instagram లో  పోస్ట్ చేశాడు. తాజాగా పలు  దేశాల మాజీ క్రికెట‌ర్లు ‘రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్’ లో ఉత్సాహంగా క్రికెట్ ఆడుతున్నారు. ఈ సందర్బంగా ఈ రోజు ఇంగ్లండ్‌ లెజెండ్స్‌తో, ఇండియా లెజెండ్స్ మ్యాచ్ ఆడబోతున్నారు.

ఈ వీడియో లో  ఫిట్‌నెస్‌ ప్రక్రియలో సచిన్ టెండూల్క‌ర్  తన ఎడమ మోచేతికి సూదులు గుచ్చుకుని ఫిజియో పర్యవేక్షణలో ఉండగా…సెహ్వాగ్ అక్కడున్నవారిని వీడియో తీస్తున్నాడు.  సచిన్ కి కుడివైపున  యువ‌రాజ్ సింగ్ కూర్చోగా అక్కడున్నవారందరు ఆశక్తికరమైన   జోకులు వేసుకుంటూ నవ్వుకుంటున్నారు.

సెహ్వాగ్ మాట్లాడుతూ  స‌చిన్ మనందరికీ దేవుడని, క్రికెట్‌ ఆడీ ఆడీ చేతులమీద వెంట్రుకలు కూడా మొలవలేదని సరదాగా వ్యాఖ్యానించాడు.  ఇప్పుడు ఆయ‌న‌ సూదులు గుచ్చుకొని తర్వాతి మ్యాచ్‌కు రెడీ అవుతున్నాడని తెలిపాడు.  అలాగే, సెహ్వాగ్ ,యువీ దగ్గరికి వచ్చి యూవీ  మ్యాచ్‌కు సన్నద్ధమయ్యాడో లేదో తెలుసుకుందామ‌ని అడగగా…. యువీ మాట్లాడుతూ… సెహ్వాగ్ ఒక  సింహం , సచిన్ మాత్రం ఒక 3 కొదమ సింహం అని అంటూ నవ్వులు పూయించారు.

అదేవిదంగా  మ్యాచ్ కి ఎలా రెడీ అయ్యారు అని అడగగా ,ఈ ప్రశ్నకి సమాధానంగా సచిన్ ఇలా బదులిచ్చాడు.  నువ్వుండగా ఎవరికైనా ఆ అవకాశం ఉంటుందా? అని స‌ర‌దాగా అన్నాడు.  ఆ త‌ర్వాత సెహ్వాగ్ కూడా స‌చిన్ తో మాట్లాడుతూ మ్యాచ్‌కు సిద్ధమయ్యారా? అని అడిగాడు. సచిన్ వెంటనే హా  అందుకోసమే యత్నిస్తున్నాన‌ని బదులిచ్చాడు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button