Tollywood news in telugu
Jr. NTR: ఎన్టీఆర్ కారుకు పడ్డ చలనాను కట్టిన అభిమాని…బదులుగా ఎమ్ కోరాడో తెలుసా !

Jr. NTR: జూనియర్ ఎన్టీఆర్కు సినిమా లో చేసే డాన్స్ కి తన నటనకి మరియు వ్యక్తిగతంగానూ చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇక ఎన్టీఆర్ సినిమా థియేటర్ లోకి వచ్చిందంటే ప్రేక్షకులకు అన్ని పండగలు కలిసి ఒకే సారి వచ్చినట్టు ఉంటుంది.
అయితే తాజాగా ఒక అభిమాని, జూనియర్ ఎన్టీఆర్… నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు మీద ఓవర్ స్పీడ్తో కారు నడిపినందుకు పడ్డ రూ.1035 చలానాను ఆన్లైన్ లో చెల్లించాడు. ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ దానికి బదులుగా ఆ అభిమాని అడిగిన కోరికేంటో తెలుసా ?
తారక్ అన్నా..నాకు నా ఫ్రెండ్స్ కి ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్లు ఇప్పించండి” అంటూ కోరాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ షోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.