health tips in telugu

How to fall asleep in 10 seconds

sleeping techniques

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే హెల్తీ ఫుడ్ ఎంత అవసరమో, సరిపడేంత నిద్ర కూడా చాలా అవసరం. రాత్రి వేళల్లో నిద్ర సరిగా పట్టడం లేదా? మంచo మీద పడుకొని అటు ఇటు దొర్లుతున్నారా? దీనినే నిద్ర లేమి అంటారు. దీనికి ముఖ్య కారణం ఒత్తిడి మరియు ఆందోళన. నిద్ర లేమి వలన మరుసటి రోజు అంతా బద్ధకంగా, చిరాకుగా,విసుగ్గా అనిపిస్తుంది. దీనివలన మనం చేయాలి అనుకున్న పనులు సరిగా చేయలేము. కాబట్టి ఆరోగ్యకరమైన జీవితానికి మంచి నిద్ర కూడా చాలా అవసరం.

మనం కంటినిండా హాయిగా నిద్రించాలంటే కింద చెప్పబోయే కొన్ని చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.

* ఏ పని అయినా క్రమం తప్పకుండా చేయడం నేర్చుకోవాలి. అది నిద్ర అయినా సరే. ప్రతి రోజు ఒక ఖచ్చితమైన టైం కి పడుకోవడం నేర్చుకోవాలి. అలా కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు అర్ధరాత్రి  దాటాక పడుకోవడం ఉదయాన్నే త్వరగా లేవడం వల్ల హెల్త్ ఇష్యుస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో కనీసం 6-7 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి.

* పడుకునే ముందు టీ, కాఫీ మరియు కూల్ డ్రింక్స్ వంటి వాటిని తీసుకోకుండా ఉంటే చాలా మంచిది. మీరు నిద్రకు వెళ్ళే ముందు ఒక వేళ వీటిని తీసుకోవాలి అనుకుంటే కనీసం 5 గంటల వ్యవధి ఉండాలి.

*సాధారణంగా చాలా మందికి మధ్యాహ్నం పూట నిద్రపోయే అలవాటు ఉంటుంది. ఇలా చేయడం వల్ల రాత్రి పూట మనకు నిద్ర సరిగా పట్టకపోవచ్చు. సాధ్యమైనంతవరకు ఈ అలవాటు మానుకుంటే మంచిది.

రాత్రి పూట నిద్రపోయే రెండు గంటల ముందు డిన్నర్ ముగించడం మంచిది. భోజనం చేసిన వెంటనే నిద్రపోతే బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగని ఖాళీ పొట్టతో పడుకోకూడదు. తేలికగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ ని మాత్రమే డిన్నర్ లో తీసుకుంటే మంచిది . డిన్నర్ తర్వాత కొంచెం సేపు వాకింగ్ చేయడం ఆరోగ్యానికి మంచిది. హై ప్రోటీన్, మసాలాలు ఉండే ఫుడ్, జంక్ ఫుడ్ ని రాత్రిపూట తీసుకోకపోవడం మంచిది.
* పడుకునే ముందు బ్రీతింగ్ కి సంభందించిన వ్యాయామాలు కొన్ని చేస్తే మంచిది. దీని కోసం, మీ ముక్కు ద్వారా ఊపిరి పీల్చుకొని మరియు కొన్ని సెకన్ల పాటు ఉంచి తరువాత ఊపిరి వదలండి . ఇలా కొన్నిసార్లు రిపీట్ గా చేయడం ద్వారా మీకు రిలీఫ్ గా ఉంది ఒత్తిడి  మరియు ఆందోళన తగ్గుతాయి. మైండ్ కూడా రిలాక్స్ అవుతుంది.

*పడుకునే ముందు ఎక్కువగా నీటిని తీసుకోకుంటే మూత్రం ఎక్కువగా వస్తుంది. దీని వల్ల నిద్ర డిస్ట్రబ్ అవుతుంది. పడుకునే ముందు ఆల్కహాల్ తీసుకోవడం, స్మోకింగ్ చేయడం మంచిదికాదు. దీనివలన నిద్ర సరిగా పట్టదు.

* ముఖ్యంగా ఎక్కువసేపు టీవీ చూడకూడదు, కంప్యూటర్స్, మొబైల్ ఫోన్స్ వీటన్నింటికి కనీసం రెండు గంటల ముందు నుండి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ద్వారా వచ్చే వెలుతురూ మన కళ్ళకు మంచిది కాదు.

*మంచి నిద్ర కోసం పడుకునే ముందు మంచి పుస్తకం చదవండి, మరియు ఆహ్లాదకరమైన సంగీతాన్ని, పాటలను వినండి. పడుకునే గదిలో వెలుతురు తక్కువగా ఉండేలా  చూసుకుంటే మంచిది. దీని వలన మన కళ్ళు హాయిగా రిలాక్స్ అవుతాయి.

సో ఇంకెందుకు ఆలస్యం ఈ టిప్స్ ని ఫాలో అవ్వండి హాయిగా నిద్రపోండి.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button