health tips in telugu

ఈ 8 హెల్త్ ఇష్యూస్ ని నిర్లక్ష్యం చేస్తున్నారా? అయితే రిస్క్ లో పడినట్లే

8 unhealth symptoms you never neglect

8 unhealth symptoms you never neglect

మనం సాధారణంగా వచ్చే చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాము. ఉదాహరణకి అప్పుడప్పుడు వచ్చే తలనొప్పి, ఎక్కువగా అలసిపోవడం, ఊపిరి తీసుకొనేటప్పుడు ఇబ్బంది పడటం లాంటివి. మనం వీటి గురించి పెద్దగా పట్టించుకోము. అప్పటికి ఏదో ఒక మెడిసిన్ తోనో, హోం రెమెడీస్ తోనో ఉపశమనం పొందుతాము. కాని ఇలా తరచుగా వస్తూ ఉంటే మాత్రం ఇంటి చిట్కాలతో, చిన్న చిన్న మందులతో కాలక్షేపం చేయడం మంచిది కాదు. తప్పని సరిగా ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ మరో తీవ్రమైన వ్యాధికి కారణం కావచ్చు. అందుకే నిర్లక్ష్యం చేయకుండా తప్పకుండా డాక్టర్ ని సంప్రదించాలి.

ఇప్పుడు మనం మన శరీరానికి పెద్దగా హాని కలిగించకపోయిన ముఖ్యంగా ఏ రకమైన లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదో ఆ లక్షణాల లిస్టు ని ఇప్పుడు చూద్దాం.

తీవ్రమైన తలనొప్పులు:

ప్రతిఒక్కరికి  తలనొప్పి జీవితంలో ఒక్కసారి అయినా వస్తుంది. మరియు దానివల్ల అంత కంగారుపడేoతగా ఏమి ఉండదు. కాని ఇదే తలనొప్పి హఠాత్తుగా వస్తే మరియు చాలా  తీవ్రంగా ఉంటే అప్పుడు దానిని సీరియస్ గానే తీసుకోవాలి. ఇది ఒక వాసిన రక్తనాళo లేదా ఒక చిట్లిన బ్లడ్ వెసల్ ని సూచిస్తుంది. ఒకవేళ ఇది మెదడులోని బ్లడ్ వెసల్ కి   జరిగితే, అది ప్రాణాంతకమవుతుంది.

ఛాతి నొప్పి

ఛాతీ నొప్పి అంటే ఎల్లప్పుడూ అది మీ హార్ట్ లో ఏదైనా ప్రాబ్లం వల్ల అని అర్థం కాదు. ఇది రక్తం గడ్డకట్టడం, ఊపిరితిత్తుల్లో సమస్య, గొంతు నుండి పొట్టకు వెళ్ళే మార్గంలో చీలడం లేదా ఇంకేదైనా ఇతర సమస్య అయినా కావచ్చు. ఛాతీ నొప్పి వల్ల మూర్ఛ, వాంతులు, మరియు ఒళ్ళంతా చెమటలు కూడా పడతాయి.

ఒక కన్ను కనపడకపోవడం:

ఒక కన్ను కనపడకపోవడం అనేది మీకు స్ట్రోక్ వచ్చే అవకాశo ఉందని అర్థం. ఇది మెదడుకు ఆక్సిజన్ సరఫరా సరిగా లేకపోవడం వలన జరుగుతుంది, మరియు సాధారణంగా శరీరం యొక్క ఒక వైపున సమస్యలను కలిగిస్తుంది.

శ్వాస ఆడకపోవుట:

మీకు అకస్మాత్తుగా ఊపిరి ఆడకపోయినట్లయితే, మీరు ఒత్తిడితో కూడిన ఎటాక్ కి గురవుతారు, ఊపిరితిత్తుల ధమనిలో లేదా రక్తనాళాలకు సంబంధించిన కొన్ని సమస్యలను కలిగి ఉంటారు.

నిరంతర అలసట:

రోజంతా పని చేసి అలసిపోయినప్పుడు మనం అలసిపోవటం అనేది పెద్ద విషయం కాదు. కానీ ఎప్పుడూ అలసటగా ఉన్నట్టు అనిపిస్తే మాత్రం అది గుండెపోటు రావడానికి చూపించే మొదటి సంకేతం కావచ్చు.

ఆకస్మికoగా వెయిట్ లాస్ లేదా వెయిట్ గెయిన్ అవడం:

ఎలాంటి ప్రత్యేకమైన కారణం లేకుండా సడన్ గా బరువు తగ్గడం వల్ల మీకు క్యాన్సర్ లేదా థైరాయిడ్ గ్లాండ్ ఎక్కువగా యాక్టివ్ గా ఉండడం లేదా కాలేయ వ్యాధులు ఉన్నట్లు అర్థం కావచ్చు.

వాంతులు

ప్రతి సారి తిన్న వెంటనే ఆహారాన్ని వాంతి చేసుకుంటున్నట్లయితే మాత్రం మీరు కడుపు క్యాన్సర్ కలిగి ఉన్నారని అర్థం. లేదా ఇతర గాల్ బ్లాడర్ లేదా తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్ అయ్యి ఉండవచ్చు.

రెగ్యులర్ దగ్గు

అప్పుడప్పుడు దగ్గడం అనేది ఊపిరితిత్తుల క్యాన్సర్ కలిగి ఉంటుందని అర్థం కాదు, ఇది న్యుమోనియా యొక్క లక్షణం. దగ్గినప్పుడు రక్తం రావడం కూడా మీరు ఇన్ఫెక్షన్ ని కలిగి ఉండవచ్చు అని అర్ధం.

కాబట్టి ఈ పైన చెప్పబడ్డ హెల్త్ ఇష్యూస్ ని ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకూడదు. ఒకవేళ ఈ లక్షణాలు ఉన్నట్లయితే డాక్టర్ ని సంప్రదించి తగు చికిత్స తీసుకోవడం మంచిది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button