Tollywood news in telugu
Prabhas Costumes : ప్రభాస్ కాస్ట్యూమ్స్ కు 6కోట్లు…ఆ మాత్రం ఉండాల్సిందే అంటున్న ఫాన్స్ ..!

Prabhas Costumes : లవ్ స్టోరీ తో తెరకెక్కుతున్న రాధేశ్యామ్ మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో హల చల్ చేస్తుంది. ఈ మూవీలో ప్రభాస్ లుక్ వేరే లెవెల్ లో ఉండబోతుందని, డార్లింగ్ కు సరికొత్త లుక్ తేవడానికి నిర్మాత కాస్ట్యూమ్స్ కోసమే ఏకంగా 6 కోట్ల వరకు ఖర్చుచేసారని వార్తలు గుప్పుమంటున్నాయి.
ఇది విన్న ఫాన్స్ పూజ హెగ్డే ను పడేయాలంటే ఆ మాత్రం కాస్ట్యూమ్స్ వాడక తప్పదు అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రభాస్ కాస్ట్యూమ్స్ కు ప్రత్యేకంగా ఒక డిజైనర్ టీం పని చేసిందని, ప్రభాస్ కెరీర్ లోనే కాస్ట్లీయెస్ట్ కాస్ట్యూమ్స్ ఇవేనని ప్రచారం జోరుగా సాగుతుంది. ఏదేమైతేనేం ప్రభాస్ మనకి కొత్తగా కనపడితే చాలంటున్నారు. అభిమానులు.