movie reviews

30 Rojullo Premnchadam Ela Movie Review: “30 రోజులు ప్రేమించడం ఎలా?” అనేది తెలిసిందా?

30 Rojullo Premnchadam Ela Movie Review: బుల్లితెర లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని టాప్ యాంకర్ గా ఎదిగిన ప్రదీప్ మాచిరాజు.. అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో చిన్న పాత్రలో కనిపించే వాడు..కానీ “30 రోజుల్లో ప్రేమించడం ఎలా?” అనే సినిమాతో సోలో హీరోగా మన ముందుకు వచ్చాడు. నేడు ఈ చిత్రం థియేటర్లు విడుదలైంది. ఈ చిత్రంలోని నీలి నీలి ఆకాశం పాట ఎంత బాగుందో సినిమా కూడా అంత బాగుందా? లేదా?అనేది తెలుసుకుందాం…

మొదట ఎంతో స్వచ్ఛంగా ప్రేమించుకొని పెళ్లి చేసుకోకుండా చచ్చిపోయిన ప్రదీప్ – అమృతలు… మళ్ళీ జన్మలో అర్జున్, అక్షర్ లు గా జన్మించి…ఎలా ప్రేమించుకుని ఎలా పెళ్లి చేసుకుంటారనేదే కథ.. ఇందులో అర్జున్, అమృత లు ఏప్పుడు టామ్ అండ్ జెర్రీ ల ఫైట్ చేసుకుంటూనే ఉంటారు. ఈ చిత్రంలో ప్రదీప్ మాచిరాజు యాక్టింగ్ సూపర్ చేశాడు.. అలాగే కామెడీ పంచులు విషయానికొస్తే టీవీ షోలో చెప్పినట్టు రొటీన్ గా చెప్పడం మైనస్ అన్ని చెప్పుకోవాలి.

అలాగే తమిళ్ హీరోయిన్ అమృత అయ్యర్ పర్ఫామెన్స్ తో యూత్ ని ఆకర్షించింది. పోసాని కృష్ణమురళి ఎమోషన్స్ ని బాగా పండించాడు.హర్ష అండ్ భద్రమ్ పంచులు కూడా బాగానే పేలాయి. అలాగే దర్శకుడు మున్నా చిత్ర నేరేషన్.. యావరేజ్ గానే చేశాడని చెప్పాలి… ఈ చిత్రానికి ప్లిస్ పాయింట్ వచ్చేసరికి అనూప్ రూబెన్స్ తన మ్యూజిక్ తో సినిమాని గట్టెక్కించాడు.అలాగే బుల్లి తెరపై ప్రదీప్ చేసిన కామెడీనే దర్శకుడు వెండి తెరపై చూపించడం వల్ల ఏం లాభం లేదనిపించింది.

ఈ సినిమాకు పెట్టిన 30 రోజుల ప్రేమించడం ఎలా? టైటిల్ కి తగ్గట్టు …సమాధానన్నీ చెప్పడంలో విఫలమయ్యారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button