Tollywood news in telugu

30 rojullo preminchadam ela Closing Collections : 30రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా క్లోజింగ్ కలెక్షన్స్..ఎంతో తెలుసా……!

30 rojullo preminchadam ela  Closing Collections  : ప్రముఖ టివి యాంకర్ ప్రదీప్ కు ఎంతటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చుప్పుకొనవసరం లేదు. ప్రదీప్ వేసే డ్రెస్ స్టైల్ ని , అదేవిదంగా హెయిర్ స్టైల్ ని యూత్ ఫాలో అవుతూ ఉంటారు కూడా , అంతలా ప్రదీప్ యూత్ ని ఆకర్షిస్తూ ఉంటాడు.  ప్రదీప్ హీరోగా కూడా మొదటి అడుగులోనే సక్సెస్ ని సొంతం చేసుకున్నాడు.

 ఇక ఈ సినిమా కు మొత్తం వచ్చిన క్లోజింగ్ కలెక్షన్స్ … విషయానికి వస్తే…  

30 rojullo preminchadam ela  Closing Collections

జనవరి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన  ‘ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమా  బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ బాగానే అందుకున్నాడు.

30 రోజుల్లో ప్రేమించడం ఎలా  సినిమా ముందు , నీలి నీలి ఆకాశం పాట ఏ రేంజ్ లో హిట్టయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు ఈ పాటకి  యూ ట్యూబ్ లో  ఏకంగా    300మిలియన్ల వ్యూవ్స్ ను అందుకొని రికార్డ్ సృష్టించింది.

తరవాత వచ్చిన ఫస్ట్ లుక్, ట్రైలర్లు కూడా మంచి ఆదరణను అందుకున్నాయి.

ఈ సినిమాను లాక్ డౌన్ కంటే ముందే సినిమాను విడుదలకు రెడీ చేసినప్పటికీ, కేంద్రం సడెన్ గా లాక్ డౌన్ అమలు చేయడంతో , సినిమా రిలీజ్ ఆగిపోయింది. ఓ టిటి  లో విడుదల చేయడానికి అవకాశం ఉన్న ప్రదీప్ ఫిస్ట్ సినిమా సిల్వర్ స్క్రీన్ పై ఆడాలనే ఉద్దేశం తో విడుదల చేయలేదు.

ఇక ఫైనల్ గా సినిమా యూవీ క్రియేషన్స్ గా GA2 సపోర్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు ఓపెనింగ్స్ తోనే భారీ కలెక్షన్ లను సొంతం చేసుకుంది. ఈ సినిమా యొక్క  ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగినప్పటికీ  టార్గెట్ ను ప్రదీప్ అందుకుంటాడా లేదా అని కాస్త అనుమానం వచ్చినా.. 4కోట్లకు పైగానే ధర పలికింది. 4.80కోట్ల టార్గెట్ తో విడుదల కాగా , 2 రోజుల్లోనే ఈ సినిమా ఏకంగా 2కోట్లకు పైగా షేర్స్ కు చేరుకుంది.

ఇక ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమా మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లోనే 6.71కోట్ల వరకు షేర్స్ వరకు చేరుకుంది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా  7.23కోట్లు వచ్చాయి. ఈ సినిమా ద్వారా విజయం అందుకున్నా ప్రదీప్ కు మార్కెట్ పెరిగి ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. మరి ప్రదీప్ తరవాత చేయబోయే సినిమా గురించి అఫీషియల్ అనౌన్సమెంట్ ఎపుడు వస్తుందో వేచిచూడాల్సిందే.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button