3 Roses characters Revealed : 3 రోజెస్ లో నటించే ముద్దుగుమ్మల ఎవరో తెలుసా ? :-

3 Roses characters Revealed : 3 రోజెస్ గురించి ఇటీవలే మనందరికీ తెలిసింది. అదేనండి కామెడీ సినిమాలకు కేర్ అఫ్ అడ్రస్ అయినా మారుతీ గారి కథ తో దర్శకుడిగా మ్యాగీ చిత్రసీమలో దర్శకుడిగా అడుగులు వేయనున్నారు. మారుతీ కథ అందించిన ఈ సిరీస్ కి మ్యాగి దర్శకత్వం వహించి తీసిన సిరీస్ ఏ 3 రోజెస్.
గత వారం రోజులనుంచి ఈ సిరీస్ కి సంబందించిన ఇంట్రెస్టింగ్ అంశాలు వెల్లడిస్తూ వస్తున్నారు. ఈ సిరీస్ ఆహ ఓటీటీ లో విడుదల కాబోతుంది. ఇన్ని రోజులు ఈ 3 రోజెస్ సిరీస్ లో ఎవరు ఆ ముగ్గురు ముద్దుగుమ్మలు అనే ఆలోచన ప్రజలలో రేగేలా చేసారు చిత్రబృందం.
అయితే ఇన్నిరోజులకి ఆ ముగ్గురు ముద్దుగుమ్మలు ఎవరో , ఆ 3 రోజెస్ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి అనేది స్పష్టత ఇచ్చింది.
ఈ 3 రోజెస్ లో మొదటి రోజ్ గా ఈషా రెబ్బ కనిపించబోతుంది. ఈషా క్యారెక్టర్ పేరు రీతు మరియు ఈమె కోరుకున్న ప్రపంచం లో ఎలా రాబోతుంది అని చుపియబోతున్నట్లు తెలిపారు.
ఇక రెండో రోజ్ గా పాయల్ కనిపించబోతుంది. పాయల్ క్యారెక్టర్ పేరు జాహ్నవి. లైఫ్ లో రూల్స్ లేకుండా ఇష్టంగా ఒక అమ్మాయి ఎలా గడపాలి అని అనుకుంటుంది అనే అంశంతో ఈ పాత్ర యొక్క కథ సాగుతుంది.
ఇక చిట్టా చివరి రోజ్ గా పూర్ణ నటించబోతుంది. పూర్ణ యొక్క క్యారెక్టర్ పేరు ఇందు. ఈ క్యారెక్టర్ ద్వారా ఒక లైవ్ ఎలా లీడ్ చేయాలో , హ్యాపీ గా లీడ్ చేయగలమా లేదా అనే అంశం తో సాగుతుంది.
ఇలా 3 వేరేవారు కథలతో ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు ప్రజలని అలరించేందుకు సిద్ధం అయ్యారు. త్వరలో ఈ సిరీస్ ఆహ లో ఎపుడు విడుదల అవబోతుందో అనే అంశం పై అధికారిక ప్రకటన జరపబోతున్నారు. చూడాలి మరి మారుతీ 3 రోజెస్ కథ తో ప్రేక్షకులని ఏ రేంజ్ లో ఎంటర్టైన్మెంట్ ఇయ్యబోతున్నారో.