Today Telugu News Updates

3 లక్షల విలువైన బంగారం కోసం 70 టన్నుల చెత్త ను జల్లెడ పట్టిన అధికారులు

మహిళలకు బంగారం అంటే పిచ్చి ప్రేమ… అందుకే ఆడవాళ్ళు ఎక్కువగా బంగారం కొంటూ ఉంటారు… కానీ ఒక మహిళ వింతగా 3లక్షలు విలువైన బంగారన్ని చెత్త కుండలో వేసింది. ఈ వార్త వింటే మీకు నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు.. కానీ ఇది నిజం.. పూర్తి వివరాల్లోకి వెళితే పూణే కి చెందిన సెలుకర్ అనే మహిళ ఇంట్లో ఉన్న చెత్తాచెదారాలన్నీ చెత్త బండి లో వేసింది…

ఆ తర్వాత ఇంట్లో మూడు లక్షల విలువైన బంగారం బ్యాగ్ కనిపించకపోవడంతో … చెత్తకుండీలో వేసినట్లు గ్రహించింది. అనంతరం శానిటరీ ఇన్స్పెక్టర్ సుశీలకు విషయం తెలియజేయగా… ఆమె సంబంధిత సిబ్బందిని ఆ బంగారం బ్యాగును వెతకాలని ఆదేశించింది.. ఈ మేరకు సుమారు 18 టన్నుల చెత్తలో శానిటరీ సిబ్బంది ఆ బ్యాగ్ ను జల్లెడ పట్టాగా.. చాలా సమయం తర్వాత ఆ బ్యాగు కంటపడింది… దీంతో ఆ మహిళ ఆనందానికి అవధులు లేవు ….. ఇదంతా చూస్తున్న స్థానికులు “అంత విలువైన బంగారన్ని ఆశ్రద్ధ చూపడం ఏంటని” తిట్టిపోస్తున్నారు

Leave a Reply

Your email address will not be published.

Back to top button