News

విద్యార్థులకు ఇకనుండి 2జీబీ డేటా ఉచితం !

2GB of data is free for students

కరోనా తెచ్చిన కష్టాలవల్ల విద్యార్థులు కూడా బలి అయ్యారు. ఆలా విద్యావ్యవస్థ ఆన్ లైన్ బాట లోకి అడుగు పెట్టింది. ఈ సందర్భం లో ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ అనేది చాలా అవసరంగా మారింది.  అందులో ముక్యంగా విద్యార్థులకు తప్పనిసరి కావడంతో  తమిళనాడు ప్రభుత్వం విద్యార్థుల పట్ల ఉదారంగా వ్యవహరిస్తోంది.

రాష్ట్రంలో ఆన్ లైన్ వింటున్న ప్రతి విద్యార్థికి  రోజుకు 2 జీబీ డేటా ఉచితంగా అందిస్తున్నట్టు సీఎం ఎడప్పాడి పళనిస్వామి  ప్రకటించారు. ఈ ఉచిత పథకంతో  9 లక్షల మంది  విద్యార్థులు లబ్ది చేకూరనుంది.

ఈ పథకం జనవరి నుంచి ఏప్రిల్ వరకు  కొనసాగనుంది.  ప్రభుత్వ, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్, ఎయిడెడ్, ఆర్ట్స్ అండ్ సైన్స్,  కాలేజీల్లో చదువుతున్న  విద్యార్థులు ఈ ఉచిత డేటా పొందడానికి అర్హులని తెలిపారు.

ఈ ఉచిత  రీచార్జి కార్డులను ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ తమిళనాడు లిమిటెడ్ ద్వారా అందిస్తామని పేర్కొన్నారు. 

Read  IPL Auction 2021 : IPL వేలంలో భారీ ధర పలికిన టాప్-5 ప్లేయర్స్ ...ఎవరో తెలుసా...!
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button