Today Telugu News Updates
ఒకే వ్యక్తికి 27 మంది భార్యలు..150 మంది పిల్లలు

మన ఇండియాలో ఒక పెళ్ళాం తోనే వేగలేక భర్తలు సతమతం అవుతుంటారు…దానికి తోడు ఇద్దరు పిల్లలు ఇంట్లో గోల గోల చేస్తూ… తండ్రులకు చుక్కలు చూపిస్తారు…ఇవన్నీ చూస్తూ.. భరిస్తున్న వ్యక్తి “అసలు పెళ్లి ఎందుకు చేసుకున్నానురా బాబు? ఎందుకు ఈ పిల్లలను కన్నాను రా బాబు ..అంటూ తల పటుకుంటాడు… కానీ ఓక అతను 27 మంది భార్యలను పెళ్లి చేసుకొని..150 మంది పిల్లలను కన్నడాటా…!
కెనడా దేశానికి చెందిన విస్టన్ బ్లాక్ మోర్ (64) 27 మంది భార్యలను పెళ్లి చేసుకున్నాడు. వీరికి 150 మంది పిల్లలు. అందులో 27 మంది భార్యల్లో 22 మందికే పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు సొంత తల్లిని ‘మామ్’ అని, సవతి తల్లులను ‘మదర్’ అని పిలుస్తారట.
విస్టన్ తను నిర్మించిన పెద్ద భవనంలోని ఒక్కో అంతస్తును ఒక్కో భార్యకు ఇచ్చాడట. 27 మందిని విన్స్టన్ వివాహం ఆడినందుకు బహుభార్యత్వం చట్టవిరుద్ధం కింద 6 నెలలు జైలులో ఉన్నాడు