1997 Movie Review and Rating | హిట్టా ఫట్టా :-

Movie :- 1997 (2021) Review
నటీనటులు :- నవీన్ చంద్ర , శ్రీకాంత్ అయ్యేంగర్ , మోహన్ మొదలగు.
నిర్మాతలు :- మీనాక్షి రమావత్
సంగీత దర్శకుడు :- కోటి
డైరెక్టర్ :- మోహన్
ముఖ్యగమనిక :- ఈ వెబ్ సైట్ లో రాసిన లేదా రాయబోయే ప్రతి ఆర్టికల్ / రివ్యూస్ మా సొంత అభిప్రాయం తో రాసినది. డబ్బులకి రేటింగ్స్ ఇచ్చే సైట్ కాదని గమనించవలసిందిగా కోరుతున్నాము. ఎవరైనా మా వెబ్ సైట్ రివ్యూస్ లింక్స్ ఫార్వర్డ్ చేసి మీకు పంపి డబ్బులు తీసుకున్నచో మాకు సంబంధం లేదు. అలాంటి చర్యలకు ఎవరైనా పాల్బడుతే తగిన చట్టరీత్య చర్యలు తీసుకొన బడును. ఏమైనా సందేహాలు ఉంటె teluguvision1@gmail.com కి మెయిల్ చేయండి …… be aware of frauds and fake people.
Story ( Spoiler Free ) :-
ఈ కథ 1997 లో జరిగిన సన్నివేశాల చుటూ తిరుగుతుంది. నెల్లూరు లోని ఓ గ్రామంలో దొర ( రాంబాబు ) యమ.యల్.ఏ గా గ్రామాన్ని తన గుప్పెట్లో పెట్టుకొని ప్రజలని కుల మతాలతో చూడటం చేస్తుంటాడు. ఎవరు అతనికి ఎదురు చెప్పలేరు. చివరికి పోలీసులు కూడా. ఒక మాటలో చెప్పాలంటే అయన చెప్పిందే వేదం.
అలా ఆ గ్రామంలోని ప్రజలు ఎప్పుడు భయాందోళనలో బ్రతుకుతున్న సమయం లో అనుకోకుండా గంగ అనే అమ్మాయి హత్యాచారానికి గురయ్యి గోరాతిగోరంగా చనిపోతుంది. ఈ హత్యాచారం విషయం బయటపడకూడదని ఈత రక చనిపోయినట్లు సీన్ కల్పిస్తారు. కట్ చేస్తే ఆ గ్రామానికి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గా విక్రమ్ రాథోడ్ ( మోహన్ ) వచ్చి నిజ నిజాలేంటో తెలుసుకునే ప్రయత్నం మొదలుపెడతాడు.
కాకపోతే ఇక్కడ పోలీసులందరు దొర యొక్క చంచాలే అందులో సి.ఐ . చారి ( శ్రీకాంత్ అయ్యేంగర్ ) కూడా ఒకరు. దొర చేసే అరాచకాన్ని కేసులు రాకుండా, వచ్చిన సాక్ష్యాలు తారుమారు చేయడం లో దిట్ట. అలాగే విక్రమ్ రాథోడ్ కూడా హత్యాచారం కేసు లో విచారిస్తున్న సమయం లో చారి తప్పుదారి పటిస్తూనే ఉంటాడు.
ఇలాంటి సందర్భాలలో విక్రమ్ ఎం చేస్తాడు ? అసలైన నిందితుడిని పట్టుకోగలిగాడా లేదా ? చారి గురించి తెలుసుకున్నాక ఎం చేశాడు ? వీటన్నిటిలో నవీన్ చంద్ర పాత్ర ఏంటి ? నవీన్ కి ఈ కేసు కు ఎలాంటి సంబంధం ? దొర ఎం చేయగలిగాడు ? చివరికి విక్రమ్ రాథోడ్ అనుకున్నది సాధించాడ లేదా అనే ప్రశ్నలకి జవాబు తెలుసుకోవాలంటే ఈ సినిమా థియేటర్ లో చూడాల్సిందే.
Positives 👍 :-
- సినిమాలో అందరూ చాలా బాగా వారి వారి పాత్రలలో జీవించేశారు.
- దర్శకుడు మోహన్ సినిమా మొదటినుంచి చివరిదాకా కథను నడిపే విధానం చాల బాగుంది ఎక్కడ బోర్ కొట్టకుండా చూసుకున్నారు. డైలాగ్స్ కి స్పెషల్ మెన్షన్ చేయాలి. చాల బాగున్నాయి డైలాగ్స్.
- థ్రిల్లింగ్ సన్నివేశాలు చాల బాగున్నాయి.
- బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది.
- నిర్మాణ విలువలు స్టైలిష్ గా ఉంది.
- సినిమాటోగ్రఫీ చాల బాగుంది.
- ఎడిటింగ్ బాగుంది.
Negatives 👎 :-
- సినిమా స్లో గా సాగుతుంది.
Overall :-
మొత్తానికి 1997 అనే సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు , ముఖ్యంగా రియల్ స్టోరీ సినిమాలు నచ్చే వారికి విపరీతంగా నచ్చే సినిమా అని చెప్పడం లో ఎటువంటి సందేహం లేదు. సినిమాలో ఎవరు నటించలేదు అందరూ వారి వారి పాత్రలో జీవించేశారు. దానికి తోడు కోటి మ్యూజిక్ చాలా బాగా సెట్ అయ్యింది.
దర్శకుడు మోహన్ కథను నడిపే విధానం చాల బాగుంటుంది. ఎక్కడ బోర్ కొట్టకుండా తీశారు. థ్రిల్లింగ్ సన్నివేశాలు సినిమాకే హైలైట్. సినిమాటోగ్రఫీ , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాల బాగుంది. నిర్మాణ విలువలు చాల బాగున్నాయి. మొత్తానికి ఈవారం కుటుంబం అంత ఈ సినిమాని హ్యాపీ గా చూసేయచ్చు .
Rating :- 3.25 /5