Tollywood news in telugu

12′ O క్లాక్ హారర్ సినిమా ట్రైలర్-2 రిలీజ్ చేసిన రామ్ గోపాల్ వర్మ!

12 o clock movie trailer

ఈ రోజు  రామ్ గోపాల్‌ వర్మ హారర్‌ తో కూడిన “12′ O క్లాక్” ట్రైలర్ తన ట్విట్టర్లో విడుదల చేసాడు.  ఇది షార్ట్ ఫిలిం తరహాకి సంబందించినది కాదని , ఒక పెద్ద సినిమా నిడివి ఎంత ఉంటుందో అదే తరహాలో ఈ సినిమా కూడా  పూర్తి స్థాయి లో ఉంటుందని వర్మ తన ట్విట్టర్ లో పేర్కొన్నాడు. ఈ సినిమా కి  కీరవాణి సంగీతం అందించగా , సినిమాటోగ్రఫీ అమోల్‌ రాథోడ్‌ చేసారు. ఈ సినిమాపై హారర్‌  పరంగా ప్రేక్షకులకు  కొత్త అనుభూతిని ఇవ్వనుందని  ట్రైలర్ ద్వారా అర్థమౌతుంది.

 ఈ ట్రైలర్ లో ఒక్క డైలాగు కూడా లేకుండా కేవలం హారర్ దృశ్యాలతో ట్రైలర్ నింపేసాడు. ఇందులోని కథాంశం  సైన్స్‌కు, ఆత్మలకు ఏదైనా సంబంధం ఉందా అనే దానిపై కొనసాగనుంది అని తెలుస్తుంది.  ఈ సినిమాలో మకర్‌దేశ్‌ పాండే, దిలీప్‌ తాహిల్‌, మానవ్‌ కౌల్‌, అలీ అజగర్‌, మిథున్‌ చక్రవర్తి, ఆశిష్‌ విద్యార్థి,  లు నటించారు. జనవరి 8న ఈ సినిమా విడుదల కాబోతుంది అని వర్మ తెలిపాడు. 

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button