Today Telugu News Updates

11 మంది చనిపోయిన చలించని కేంద్ర ప్రభుత్వం

ఆందోళనల్లో భాగంగా 11 మంది అన్నదాతలు మరణించడంపై రాహుల్ గాంధీ మండిపాటు… అమల్లోకి తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత 17 రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే . అయితే ఈ ఆందోళనల్లో భాగంగా రైతులు మరణించారంటూ వచ్చిన వార్తా కథనాలపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు , ఎంపి రాహుల్ గాంధీ స్పందించారు . కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు . నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయా లంటే రైతులు ఇంకెన్ని త్యాగాలు చేయాలని నిలదీశారు . పంజాబ్ , హర్యానా రాష్ట్రాలకు చెందిన రైతులు దేశ రాజధానిలోని వివిధ సరిహ దుల్లో గత రెండు వారాలకు పైగా నుంచి ఆందోళన చేస్తున్నారు . ఇప్పటికే రైతు ప్రతినిధులు , కేంద్రానికి ముధ్య అధికారికంగా దాదాపు ఐదుసార్లు చర్చలు జరిగాయి . అయినా ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది .

వివాదా స్పద మూడు చట్టాలను రద్దు చేయాలన్న ప్రధాన డిమాండ్ తో రైతులు ఇంకా ఆందోళన ఉధృతం చేస్తున్నారు . ఈ నేపథ్యంలో రాహుల్ స్పందిస్తూ వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటే ఇంకెంత మంది రైతులు త్యాగం చేయాలని ట్విట్టర్ వేదికగా కేంద్రానికి ప్రశ్నించారు . గత 17 రోజులుగా రైతుల ఆందోళనల్లో భాగంగా 11 మంది అన్నదాతలు అనారోగ్యానికి పాలుకావడం లేదా ప్రమాదానికి గురికావడం వంటి కారణాలతో మరణించారంటూ మీడి యాలో వచ్చిన కథనాలను రాహుల్ ట్విట్టర్ లో షేర్ చేశారు . ఈ 17 రోజుల్లో 11 మంది రైతు సోదరులు మృత్యువాత పడినప్పటికీ మోడీ ప్రభు త్వానికి ఎలాంటి పశ్చాత్తాపం చెందడం లేదని కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్ సుర్దేవాలా ఆగ్రహం వ్యక్తం చేశారు . ప్రభుత్వం ఇప్పటికీ అన్నదాతలకు కాకుండా డప్పు సమకూర్చే వారికి అండగా నిలుస్తుందని విమర్శించారు .

11 మంది చనిపోయిన చలించని కేంద్ర ప్రభుత్వం

ఈ మేరకు సుర్దేవాలా ట్వీట్ చేశారు . రాజ్యాంగ బాధ్యత గొప్పదా ?, మొండితనం గొప్పదా ? అని ఈ దేశం తెలుసుకోవాలనుకుం టోంది ‘ అని ఆయన ప్రశ్నించారు . రైతులు తాము పండించిన పంటలను దేశంలో ఎక్కడైనా విక్రయించేందుకు , దళారీ వ్యవస్థకు అంతం పలికేం దుకు వ్యవసాయరంగంలో భారీ సంస్కరణలు తీసుకురావాలన్న ఉద్దే శంతో సెప్టెంబర్ లో మూడు వ్యవసాయ బిల్లులను పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టి ఆమోదింపచేసుకుంది . ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ మావోయిస్టు , దేశద్రోహి ముద్ర మోడీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన ప్రతి ఒక్కరిపై మావోయిస్టులు గానూ , దేశ ద్రోహులుగానూ ముద్ర వేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది . అదే విధంగా ఆందోళన చేస్తున్న రైతుల డిమాండ్లను అంగీకరించాలని డిమాండ్ చేసింది . రైతుల ముసుగులో శాంతియుతంగా చేస్తున్న అన్నదా తలు ఉద్యమాన్ని చెడగొట్టేందుకు కొన్ని అసాంఘిక శక్తులు కుట్ర పన్ను తున్నాయని వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వ్యాఖ్యానిం చిన మరుసటి రోజు కాంగ్రెస్ పై విధంగా పేర్కొంది .

రైల్వే శాఖమంత్రి పీయుష్ గోయల్ కూడా రైతుల ఆందోళనలను తిరుగుబాటుదారులు , మావోయిస్టు శక్తులు నియంత్రణలోకి తీసుకున్నట్లు కనిపిస్తోందని బహి రంగ వ్యాఖ్యలు చేశారు . ఈ నేపథ్యంలో సుర్దేవాలా ట్వీట్ చేస్తూ ‘ మోడీజీ … ప్రజాస్వామ్యంలో నిరంకుశత్వానికి స్థానం లేదు . ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన ప్రతి ఒక్కరిని మావోయిస్టుగా , దేశ ద్రోహిగా చూడడం మీరు , మీ మంత్రుల విధానంగా ఉంది ‘ అని అన్నారు . ఎముకలు కొరికే చలిలో , భారీ వర్షాలను సైతం లెక్క చేయకుండా ఆందోళన చేస్తున్న రైతులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు . చట్టబద్ధమైన అన్నదాతల డిమాండ్ల ను అంగీకరించాల న్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button