Viral: అమ్మో బాబోయ్.. ఒకే డ్రస్సు 100 రోజులు వేసుకున్న మహిళ
మనం ఈరోజు వేసుకున్న డ్రెస్సు రేపు వేసుకోవాలంటేనే చిరాకు వస్తుంది. అలాంటిది ఒక మహిళ ఓకే డ్రెస్ వంద రోజులు వేసుకున్నదంటే ఆశ్చర్యకరమైన విషయమే..

అమెరికాలోని “ఉల్ అండ్” అనే బట్టల కంపెనీ “100 రోజుల డ్రెస్ ఛాలెంజ్” తీసుకవచ్చింది. ఈ చాలెంజ్ ని స్వీకరించి గెలిచిన మొదటి 50 మందికి రొవెనా స్వింగ్ అనే డ్రెస్‌ను ఉచితంగా అందజేస్తామని ఉల్ అండ్ ప్రకటించింది. దీంతో ఈ ఛాలెంజ్ ను అమెరికాలోని బోస్టన్‌కు చెందిన 52 ఏళ్ల సారా రాబిన్స్ కోల్ స్వీకరించింది. సెప్టెంబరులో మొదలుపెట్టిన వంద రోజుల చాలెంజ్ కాస్త నిన్న మొన్నటి వరకు పూర్తయింది. ఈ చాలెంజ్ లో భాగంగా సారా క్రిస్మస్ రోజు, ఆదివారాలు, ఫంక్షన్లు ఎక్కడికి వెళ్ళినా ఒకటే డ్రెస్సుతో వంద రోజులు గడిపింది. ఆమె వందరోజుల జర్నీ ని డాక్యుమెంటరీగా చేసి సారా సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.