Today Telugu News Updates

సెంటీ బిలియనీర్స్ క్లబ్ జాబితాలో జుకర్ బర్గ్ :-

మొదటి సారిగా ఫేస్ బుక్ సి ఈ ఓ మార్క్ జుకర్ బర్గ్ సెంటీ బిలియనీర్ క్లబ్ జాబితాలో చోటు దక్కించుకున్నాడు .

యూస్ స్టాక్ మార్కెట్ లో ఎఫ్ బి షేర్లు బారి స్థాయి లో లాభ పడటంతో జుకర్ బర్గ్ సంపద అమాంతం 100 బిలియన్ డాలర్లకి వెళ్ళింది .

ఇప్పటికే జెఫ్ బెజోస్ ,బిల్గేట్స్  సెంటీ బిలియనీర్స్  జాబితాలో ఉన్న విషయం తెలిసిందే , ఇపుడు పేస్ బుక్ ఉన్న 13 శాతం వాటా ద్వారానే జుకర్ బర్గ్ సెంటీ బిలియనీర్స్  జాబితాలో చోటు దక్కించుకున్నాడని బ్లూమ్ బర్గ్ బిలియన్స్ ఇండెక్స్  తెలిపింది .

ఇండియా బ్యాన్ చేసిన టిక్ టాక్ కు పోటీగా పేస్ బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఫీచర్స్ ని అందుబాటులోకి తెచ్చింది . అయితే యు యస్ కూడా తాజాగా టిక్ టాక్ ఫై నిషేధం విధించింది , ఈ నిషేధం 45 రోజుల్లో అమలవుతుంది .

ఈ సందర్భంలో టిక్ టాక్ కు వున్న మార్కెట్ రీల్స్ దక్కించుకోగలుగుతుంది అనే అంచనాలతో పేస్ బుక్ షేర్ల పెట్టుబడులు భారీగా పెరిగాయి. ఫలితంగా జుకర్ బర్గ్ సంపద కూడా అమాంతం పెరిగి పోయింది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button