Today Telugu News Updates

సంచనాత్మక తీర్పు ఇచ్చిన వరంగల్ జిల్లా కోర్టు

ఒక హత్యను కప్పిపుచ్చుకునేందుకు తొమ్మిది మందికి మత్తు మందు ఇచ్చి హతమార్చిన మానవ మృగానికి గతంలో ఉరి శిక్ష విధించిన వరంగల్ జిల్లా న్యాయస్థానం తాజాగా మరో కేసులో జీవితకాల శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరిం చింది . పోలీసులు , ప్రాసిక్యూషన్ కథనం మేరకు .. బీహార్ రాష్ట్రానికి చెందిన సంజయ్ కుమార్ ..రఫీకా అనే స్త్రీతో వివాహేతర సంబంధం కొనసాగించి ఆమెతో సహజీ వనం చేసేవాడు .

ఓ గోనెసంచుల తయారీ మిల్లులో పనిచేసే సంజయ్ కు మారు రఫీకాతో పరిచయం ఏర్పడిన తరువాత ఆమె పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది . ఆమెతో పాటు ఆమె మైనర్ కుమార్తెను లోబర్చుకున్న సంజ య్ కుమార్ బాలికను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు . ఈ విషయం పసిగ ట్టిన రఫీకా తన కుమార్తె జోలికి రావద్దని హెచ్చరించడంతో ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి పశ్చిమ బెంగాల్ వెళ్లాద్దామని చెప్పి రైల్లో తీసు కువెళ్లి హతమార్చాడు . ఈ ఏడాది ఫిబ్రవరి 20 వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిడదవోలు ప్రాంతంలో కూల్ డ్రింక్ లో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి రైళ్లో నుండి తోసి రఫీకాను హతమార్చాడు .

అయితే రఫీకా ఆచూకీ కోసం ఆమె చిన్నాన్న మసూద్ అలం , అతని భార్య నిషా అలంలు ఆరా తీయడంతో తన హత్య చేసిన విషయం బయటపడుతుందని నిందితుడు సంజయ్ కుమార్ మసూద్ అలం కుమారుడు షాబాద్ అలం పుట్టినరోజు వేడుకల్లో ఆహారంలో నిద్రమాత్రలు కలిపి మసూద్ అలం , అతని భార్య నిషా , అతని కుమారులను , కుమార్తెను మూడేళ్ల అతని మనుమడు బబ్లూను వారితో పాటు పుట్టినరోజు వేడుకకు వచ్చిన మరో ముగ్గురు కార్మి కులను మత్తు మందు తినిపించి పాడుబడ్డ బావిలో పడవేసి హత్య చేశాడు . ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది .

సంచనాత్మక తీర్పు ఇచ్చిన వరంగల్ జిల్లా కోర్టు

పకడ్బందీ విచారణతో నిందితుడికి ఉరిశిక్ష .. ఈ ఏడాది మే 27 వ తేదీన గీసుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని గొర్రెకుంట సమీపంలోని ఓ మిల్లులో చోటు చేసుకున్న ఈ ఘటనలో తొమ్మిది మంది హతమవడంతో మామునూరు ఎసిపి శ్యాంసుందర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి సమగ్ర విచారణ చేపట్టాయి . నిందితుడు సంజ య్ కుమారు మూడు రోజుల్లోనే ఆధారాలతో సహా పట్టుకొని కోర్టు ముందు హాజరుపరిచారు . ఆ తరువాత ఎసిపి శ్యాంసుందర్ ఆధ్వర్యంలో సిఐ శివరామయ్య , టాస్క్ ఫోర్స్ , టెక్నికల్ బృందాలు పకడ్బందీ ఆధారాలు సేకరించి సమగ్రంగా చార్జ్ షీటు తయారు చేసి వరంగల్ మొదటి అదనపు జిల్లా కోర్టులో ప్రవేశపెట్టి సాక్షాధారాలు కోర్టు ముందు ఉంచారు . పిపి సత్యనారాయణ ప్రాసిక్యూషన్ తరపున వాదించారు .

పోలీసులు పకడ్బందీ ఆధారాలు ప్రవేశపెట్టడంతో అక్టోబర్ 25 న మొదటి అదనపు న్యాయ మూర్తి కె.జయకుమార్ నిందితునికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు . ఫోక్సో కేసులో మళ్లీ జీవిత శిక్ష … రఫీకా మైనర్ కుమార్తె ఫిర్యాదు మేరకు ఆహత్య కేసుతో పాటు మైనర్ బాలిక అత్యాచారం చేసిన కేసులో పోలీసులు ఫోక్సో చట్టం కింద మరో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు . ఈ కేసులో విచారణ అధికారిగా మామునూరు ఎసిపి శ్యాంసుందర్ వ్యవహరించారు . మైనర్ బాలిక వ్యవ హారం కావడంతో వివరాలు గోప్యంగా ఉంచుతూ సాక్షాలు కోర్టు ముందు ప్రవేశపెట్టడంతో శుక్రవారం ఫోక్సో కేసులో నిందితుడు సంజయ్ కుమా రకు గతంలో విధించిన ఉరిశిక్షతో పాటు బతికి ఉన్నంతకాలం జీవితకాల కారాగార శిక్ష విధిస్తూ న్యాయమూర్తి జయకుమార్ ఫోక్సో కేసులో తీర్పు వెలువరించారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button