health tips in telugu

శరీరంలో మీకు ఇలాంటి ఇ ప్రమాదకరమైన లక్షణాలు కనబడుతున్నాయి అయితే మీకు ఈ విటమిన్ లోపం ఉన్నట్లే

మనం ఆరోగ్యంగా ఉండడానికి కనిజాలు, పోషకాలు విటమిన్స్ అతి ముఖ్యమైనవి. ఇవి చర్మం, జుట్టు మరియు రోగనిరోధక శక్తి విషయంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి ఇందులో విటమిన్ ఎ ముఖ్యమైనది. ఆరోగ్యకరమైన కళ్ళు, జుట్టు, చర్మం, సమస్యలు ఇన్ఫెక్షన్ నుంచి శరీరాన్ని రక్షిస్తుంది, మనం తీసుకునే పోషకాహార పదార్థాల నుంచి మనకు లభిస్తుంది పోషకాహారం సరిగా తీసుకో లేనప్పుడు విటమిన్ ఎ కొరత ఏర్పడుతుంది. కొన్నిసార్లు ఈ విటమిన్ కొరత తీవ్రమైన ఇన్ఫెక్షన్ల బారిన పడేలా చేస్తుంది , ఎలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందంటే?

విటమిన్ ఎ కొరత లక్షణాలు రాత్రి అంధత్వం, వాపు, పొడిబారిన చర్మం, కార్నియా పొడిబారడం, పిల్లల శారీరక అభివృద్ధి లేకపోవడం, సంతానం లేమి ఇలా అనేక సమస్యలు మొదలవుతాయి ఈ సమస్యలు కొన్ని సందర్భాల్లో మరణానికి కూడా దారితీస్తాయి. జీర్ణకోశ వ్యాధులతో బాధపడే వారిలో కూడా విటమిన్ ఎ లోపం రావచ్చు .

అంతేకాకుండా విటమిన్ లోపం ఉన్న వాళ్ళు పెదవులు పొడిబారడం తామర సమస్యలు మొటిమలు, మడతలు అనేక శారీ తో సంబంధిత సమస్యలు ఉంటాయి రక్తపరీక్ష చేసుకోవడం ద్వారా ఈ లోపాన్ని మనం గుర్తించవచ్చు విటమిన్ ఏ లోపం ఉంటే మంచి పోషకాహారాలు సప్లిమెంట్స్ తీసుకోవాలి లివర్ ఆయిల్, ఆకుకూరలు, బత్తాయి, పాలకూర, క్యారెట్, పాల ఉత్పత్తులు, జున్ను ఫుల్ క్రీమ్ పాలు , బొప్పాయి, మామిడి, నేరేడు పండ్లు, చేపలు తీసుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button