Real life stories

చాణక్య నీతి సూత్రాలు: పురుషులకు మనశాంతి లేకుండాచేసే 5 విషయాలు

భారతదేశ చరిత్రలో జ్ఞానసముపార్జన పొందిన మహోన్నతమైన వ్యక్తి అలాగే ‘భారతదేశ పయనీర్ ఎకనామిస్ట్ ‘ గా పేరు సంపాదించుకున్న మహా పురుషుడు ‘చాణక్య’. ఈ వ్యక్తి ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఇతను క్షత్రియ సమాజంతో కలిసి పనిచేసారు.

చాణక్య గారు ‘ఇతరుల ప్రవర్తన వల్ల  మన అంతర్గత శాంతిని నాశనం చేయకుండా చూసుకోవాలి ‘ అని బోధిస్తారు.

అలాగే మానవ జీవన విధానం పై ఎన్నో రచనలు చేసారు. అందులోని ఒక 5 విషయాలు గమనిస్తే మనం మనశాంతిని కోల్పోకుండా ఉంటాము.

1. మనిషికి లేని దానిపై ఆశపడడం.

ప్రతి వ్యక్తి తన దగ్గర ఉన్నదానిగురించి మరచిపోయి, లేనిదానిగురించి ఆరాట పడుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల  తన కోరికలు నెరవేరకపోవడంతో ఆ మనిషి డిప్రెషన్ కి లోనై తన మనశాంతిని కోల్పోతాడు.   

2. తనను తాను తక్కువగా అంచనావేసుకోవడం.

ఒక వ్యక్తి మరొక వ్యక్తి కింద పనిచేస్తున్నప్పుడు ‘ఆత్మ విశ్వసాన్నీ’  కొల్పుతూ ఉంటాడు. ఈ సమయంలోనే చాణిక్య చాల ఓర్పుతో ఉండాలని బోధిస్తున్నాడు.

3. తన కుమార్తెను వితంతువుగా చూసినపుడు.

కూతుర్నికన్న తండ్రి , పెళ్లి తర్వాత ఎప్పుడైతే తన కుమార్తెను అనుకోని పరిస్థితులవల్ల వితంతువుగా చూడాల్సి వస్తుందో ఆ రోజునుండి ఆ కన్న తండ్రి శాంతియుతంగా జీవించలేడు.

4. భార్య కోపంగా ఉన్నపుడు.

భర్తపై ఎప్పుడైతే తన భార్య అలగడమో లేదంటే వీరి మధ్య వివాదాలు తలెత్తినపుడు వీరు మనశాంతిగా ఉండలేరు.

5. అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల .

ప్రతి మనిషి తన బిజీ లైఫ్ లో మంచి ఆహారం తీసుకోలేక పోతున్నాడు. ఆ సమయంలో అందుబాటులో ఉండే ఆహారం తీసుకోవడం వల్ల అనారోగ్యానికి గురి అయ్యాక తన ఆత్మ విశ్వాసాన్ని , మనశాంతిని కోల్పోతాడు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button