Today Telugu News Updates

కేటీఆర్ కవితలను ఎందుకు అరెస్ట్ చేయలేదు, కేంద్ర మంత్రి ఘాటు వ్యాఖ్యలు

ఇటీవల భారత్ బంద్లో భాగంగా రాస్తారోకోలో పాల్గొన్న మంత్రి కెటిఆర్ , కవి తలు పాల్గొంటే ఎందుకు అరెస్ట్ చేయలేదని కేంద్ర మంత్రిగా డిజిపిని ప్రశ్నిస్తున్నా నని అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు . బిజెపి హైదరాబా లో శాంతియుతంగా నిరసన చేయాలని భావిస్తే మా నేతలను ముందస్తు గృహ నిర్భంధం చేస్తారని , ఎక్కడో ఆదిలాబాద్ , నిజామాబాద్ లో బిజెపి కార్యకర్తలను అరెస్టు చేస్తారని తెలిపారు . మరి బస్సులు ఆపిన , ట్రాఫిక్ అడ్డుకున్న కెటిఆర్ , కవిత , మంత్రులను ఎందుకు అరెస్టు చేయలేదన్నారు . ఇకపై బిజెపి చేసే నిరసన కార్యక్రమాలకు పోలీసులు సహకరించాలన్నారు . కనీస మద్దతు ధరకు చట్ట బద్ధత కల్పిస్తామని తెలిపారు .

బిజెపి రాష్ట్ర కార్యాలయంలో సోమ వారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొన్నటి బంద్ రైతుల బంద్ కాదని , రాష్ట్రంలో జరిగింది సర్కారీ బంద్ అని విమ ర్శించారు . ప్రభుత్వమే బంద్ చేయించిందని , బస్సులను ఆపేయించిందని , షాపులు మూసేయించిందని ఆరోపించారు . కేవలం మోడీపై కోపంతోనే వ్యవసాయ చట్టాలను టిఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకించిందన్నారు . కలలో కూడా రైతు వ్యతిరేక నిర్ణయాలను మోడీ ప్రభుత్వం తీసుకోదని అన్నారు . రైతుల ఉద్యమం పంజాబ్ కే పరిమితమైనప్పటికీ దేశ వ్యాప్తంగా రైతులను కలిసి వాస్తవాలు వివరిస్తామని తెలిపారు . సోనియాగాంధీ యుపిఏ ఛైరపర్సన్ గా వారి ప్రభుత్వం ఉన్నప్పుడే రిలయన్స్ ఫ్రెష్ లు , ఆదానీలు వ్యవసాయ రంగంలోకి ప్రవేశించారని తెలిపారు . పంజాబ్ లో మండి లాబీ ఉద్యమం చేస్తున్నదని , అయినప్పటికీ వారిని గౌరవించామ న్నారు .

చట్టాల్లో మార్పులు చెయ్యడానికి సిద్ధమని చెప్పినా ఉద్యమం చేస్తున్న వారు వితండవాదం చేస్తున్నారని విమర్శించారు . మోడీ పై ఉన్న కక్షతో గుడ్డిగా చట్టాలను వ్వ్యతిరేకించవద్దని విజ్ఞప్తి చేశారు . ఎంఎపికి చట్టబద్ధత కల్పిస్తామని , మార్కెట్ యార్డ్ లను ప్రోత్సహిస్తామని తెలిపారు . గజ్వెల్ లో ఐటిసి కంపెనీ రైతులతో ఒప్పందం చేసుకొని సీడ్స్ ఉత్పత్తి చేస్తోందన్నారు . కిసాన్ బ్రాండ్ పేరుతో ఒకటి రెండు నెలల్లో రామగుండం నుండి తెలుగు రాష్ట్రాలకు యూరియా ఇవ్వనున్నామని , ఇందుకు రూ .6 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు . 1.15 లక్షల కోట్ల రుణాలు రైతులకు కేంద్రం ఇచ్చిందన్నారు . పంటల బీమా పథకం దురదృ స్టవశాత్తు తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడం లేదని కిషన్ రెడ్డి అన్నారు . వ్యవసాయం చేస్తే పిల్లను కూడా ఇవ్వడం లేదని , ఇలాంటి పరిస్థితి పోవా లని , రైతు ఆదాయం పెరగాలని అన్నారు . ఇప్పటి వరకు కేంద్రం చేసింది చాలా తక్కువ ఇంకా ఎంతో చేయాల్సి ఉన్నదని చెప్పారు . రైతులంటే బిజె పికి ఎనలేని ప్రేమ అని , తమకు ఎవరి రికమండేషన్స్ అవసరం లేదన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button