Today Telugu News Updates

కార్పొరేటర్ లలో కొత్త భయం

ఎంఎల్‌సినా … కార్పొరేషనా … ఏదీ ముందు ఇప్పడు జిల్లాలో ప్రధాన చర్చనీయాంశమైంది . ఏ ఎన్నిక ముందు వస్తుందన్న దానిపై తర్జన భర్జనలు సాగుతు న్నాయి . నాలుగైదు రోజుల క్రితం వరకు ఏడవ తేదీ సాయంత్రం ఖమ్మం కార్పొరేషన్‌కు సంబం ధించి నోటిఫికేషన్ వెలువడుతుందన్న ప్రచారం మొదలైంది . రెండు రోజుల క్రితం రాష్ట్ర ఎన్నికల సంఘం ఖమ్మం , వరంగల్ కార్పొరేషన్లకు సంబం ధించి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరగవని తేల్చి చెప్పడంతో 2020 లో కార్పొరేషన్ ఎన్నికలు లేవ ని తేలిపోయింది . వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఏ ఎన్నికలు ముందు వస్తాయో అన్న దాని వైపు చర్చ మళ్లింది .2021 మార్చి నాటికి శాసన మండ లి పట్టభద్రుల ఎంఎల్‌సి పదవీ కాలం ముగు స్తుంది . కార్పొరేషన్ పదవీ కాలం కూడా మార్చి లోనే ముగుస్తుండడంతో ఏ ఎన్నిక ముందు జరగ నుందనే దానిపై వాదోప వాదనలు జరుగుతుం డగా ఏ ఎన్నికకు ఎలా వ్యవహరించాలన్న దాని పై రాజకీయ పార్టీలు కసరత్తు చేస్తున్నాయి .

రాజ కీయ పొందికను కూడా ఎన్నికను బట్టి మారే అవకాశం ఉంది . టిఆర్ఎస్ ఎంఎల్‌సి అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు . వామపక్షాల అభ్యర్థి జయ సారధిరెడ్డి ఇప్పటికే ప్రచారాన్ని ఉధృతం చేయగా కొందరు స్వతంత్రులు ప్రో కోదండ రాం తదిత రులు ఎంఎల్‌సి బరిలో ఉండి ప్రచారం నిర్వహి స్తున్నారు . ఇక కార్పొరేషన్‌కు సంబంధించి సిట్టిం గుల్లో గుబులు మొదలైంది . నిన్న మొన్నటి వరకు తమకు డోకా లేదని భావించిన సిట్టింగులకు ఇప్పుడు హైద్రాబాద్ ఫలితం కొత్త తంటా తెచ్చిపెట్టింది . హైద్రాబాద్లో సిట్టింగులకు తిరిగి టిక్కెట్ లను కేటాయించడం వల్లే టిఆర్ఎస్ ఓటమికి కారణమని టిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటిఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఖమ్మం కార్పొరే షన్ పరిధిలో ఎంత మందికి టిక్కెట్లు దక్కుతాయ న్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది . కొందరు కార్పొరేటర్లపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి . కట్టా లు , ప్రైవేటు పంచాయతీలు , ఇతరత్రా వ్యవహా రాల్లో జోక్యం చేసుకుని పరపతిని పొగొట్టుకున్నా రన్న ప్రచారం జరుగుతుంది . మరి కొందరు అభి వృద్ధికి దూరంగా ఆ డివిజన్లను పట్టించుకోకపోవడం కూడా విమర్శలకు తావిస్తుంది .

అతివృష్టి , అనావృష్టి అన్నట్లు కొందరు అతి జోక్యం , కొందరి నిరాసక్తత అభ్యర్థులను మార్పు చేయా ల్సిన పరిస్థితి ఏర్పడింది . డివిజన్ల సంఖ్య 50 నుంచి 60 కు పెరగడంతో డివిజన్ల హద్దులు మారే అవకాశం ఉంది . దీనికి తోడు రిజర్వేషన్లు కూడా మారనున్నాయి . సానుకూల రిజర్వేషన్ రాకపోతే అనివార్యంగా పోటీ నుంచి తప్పుకోవాల్సిన పరి స్థితి సిట్టింగ్ కార్పొరేటర్లకు ఏర్పడుతుంది . ఒక వేళ రిజర్వేషన్ వచ్చినా పార్టీ టిక్కెట్ కేటాయిం చని పక్షంలో ఏమిటన్నది కూడా సిట్టింగ్ కార్పొరే టర్ల మదిని తొలుస్తుంది . హైద్రాబాద్ లో సిట్టింగ్ కార్పొరేటర్ల వల్లే పార్టీ ఓటమి చెందిందన్న భావన నేపథ్యంలో సిట్టింగ్ లో టిఆర్ఎస్ నుంచి ఎవరికి టిక్కెట్లు దక్కుతాయి . దక్కకపోతే ఏమిటన్న దానిపై కార్పొ రేటర్లలో గుసగుసలు మొదలయ్యాయి . ఇదిలా ఉండగా కొందరు సిట్టింగ్ కార్పొరేటర్లకు అటు మీకు టిక్కెట్ దక్కదు మా వైపు చూడండి అంటూ కొందరు ఫోన్లు చేస్తున్నారన్న ప్రచారం కొసమెరుపు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button