Tollywood news in telugu

హైదరాబాద్ వాసులకు మరో గిఫ్ట్ ఇచ్చిన సర్కారు

దోమలగూడలో ఇందిరా పార్కులో ఏర్పాటు చేసిన పంచతత్వ పార్కును మున్సి పల్ శాఖమంత్రి కె.టి.రామారావు ప్రారంభించారు హైదరాబాద్ వాసులకు మరో గిఫ్ట్ ఇచ్చిన సర్కారు . ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ , నగర మేయర్ బొంతు రామ్మోహన్ , స్థానిక ఎంఎ ముఠా గోపాలు హాజరయ్యారు . పార్కులో ఎనిమిది బ్లాకుల్లో ఎకరం విస్తీ ర్ణంలో ఆక్యుప్రెజర్ వాకింగ్ ట్రాక్ నిర్మాణం చేపట్టారు . కంకరరాళ్లు , నల్లరేగడి మట్టి , నీరు , ఇసుక , చెక్కపొట్టు , గులకరాళ్లతో నడకదారి నిర్మించారు . నడుస్తున్నప్పుడు పాదాల అడుగుభాగంలో ఉన్న నరాలపై ఒత్తిడి పడేలా ట్రాక్ నిర్మాణం చేశారు . ట్రాక్ వలయం మధ్యలో వివిధ రకాల ఔషధ మొక్కలను నాటారు . ట్రాక్ పై నడుస్తున్న ప్పుడు పాదాల అడుగు భాగంలో ఉన్న నరాలపై వివిధ స్థాయిలో ఒత్తిడిని కలిగించే పద్ధతిలో 20 ఎం.ఎం , 10 ఎం.ఎం రాళ్లు , రివర్ స్టోన్స్ , 6 ఎం.ఎం చిప్స్ , ఇసుక , చెట్ల బెరడు , నల్లరేగడి మట్టి , నీటి బ్లాక్లను విడివిడిగా అనుసంధానం చేస్తూ వాకింట్ ట్రాకను నిర్మించారు . అన్ని వైపులా 40 రకాల మెడిసినల్ , హెర్బల్ ప్లాంటు బ్లాలుగా ఏర్పాటు చేశారు .

హైదరాబాద్ వాసులకు మరో గిఫ్ట్ ఇచ్చిన సర్కారు ::

మొదటగా నరాలపై అధిక ఒత్తిడి కలిగించే ట్రాక్ నుండి క్రమ పద్ధతిలో ఒత్తిడి తగ్గించే ట్రాక్ వైపు నడవటం వల్ల రక్తప్రసరణలో సాను కూల మార్పు జరిగి వివిధ రకాల అనారోగ్యాలు దూర మవుతాయి . ఈ పార్కును రూ .16 లక్షలతో ఏర్పాటు చేశామని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు . ఇందులో 50 రకాల హెర్బల్ ప్లాంట్లను ఏర్పాటు చేసి నట్లు చెప్పారు . నగరంలో మరో 16 పంచతత్వ పార్కులు ప్రారంభించనున్నట్లు ప్రకటించారు . ఇందిరా పార్కును రూ .4 కోట్లతో మరింత అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడిం చారు . ఈ పార్కు మధ్యలో గౌతమ బుద్ధుడి విగ్రహాన్ని నెలకొల్పారు . విశ్వ నగరంగా హైదరాబాద్ … పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి కెటిఆర్ జిహెచ్ఎంసి అదనపు కమిషనర్ డాక్టర్ ఎన్.యాదగిరి

రావు రచించిన విశ్వనగరంగా హైదరాబాద్ అనే పుస్తకాన్ని రాష్ట్ర మున్సిపల్ శాఖమంత్రి కె.టి.రామారావు ఆదివారం ఆవిష్కరించారు . మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ హాజరైన ఈ పుస్తక ఆవిష్కరణ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ నగర చరిత్రలో గత ప్రభుత్వ హయాంలో మరెన్నడూ లేని విధంగా అభివృద్ధి జరిగిందన్నారు . నగరంలో జరిగిన ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తెలియ చేస్తూ డాక్టర్ యాదగిరి రావు సమగ్రమైన పుస్తకాన్ని వెలువరించడం అభినందనీయమన్నారు . ముఖ్య కార్యదర్శి మాట్లాడుతూ హైదరాబాద్ అభివృద్ధి వివరాలను మంచి ఫోటోగ్రాతో కూడిన ఈ పుస్తకం మంచి కాఫీ టేబులుగా ఉందని అభినందించారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button