హీరో ఆది కొత్త చిత్ర టీజర్ ని విడుదల చేసిన చిరంజీవి….

ప్రేమ కావాలి చిత్రంతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పరిచయమైన సాయి కుమార్ కుమారుడు ఆది కొత్త సినిమా “శశి” టీజర్ ను ఈరోజు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేశారు. మరో విషయం ఏంటంటే నేడు ఆది పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఈ పోస్టర్ విడుదల చేసింది

ఈ “శశి” చిత్రాన్ని శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ బ్యానర్ వారు తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రొడ్యూసర్ లుగా ఆర్పీ వర్మ, శ్రీనివాస్ , చావాలి రామాంజనేయులు వ్యవహరిస్తున్నారు. అలాగే శ్రీనివాస్ నాయుడు చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు

ఈ టీజర్ మొదట హీరో ఆది “మన చివరి క్షణాలు చూస్తున్నప్పుడు మొదటి క్షణాలు గుర్తుకొస్తాయి” అనే డైలాగ్ బ్యాగ్రౌండ్ వాయిస్ తో మొదలవుతుంది. ఈ టీజర్ చూస్తే.. ఆది చిత్రంలో గిటార్ ప్లేయర్ పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. “అమ్మాయి అందంగా ఉందని ప్రేమించేసి.. ఆ తర్వాత ప్రాబ్లంలో ఉందని వద్దు అని వదిలేస్తే.. అది లవ్ ఎలా అవుతుంది?”అనే డైలాగ్ ఆది హైలెట్ గా చెప్తాడు. “మనకు నచ్చినట్టు లైఫ్ లేకపోతే..లైఫ్ ఉండి వేస్ట్…మనకు కావలసింది గట్టిగా అడక్కపోతే గోల్ ఉండి వేస్ట్ అనే చివరి డైలాగ్ తో టీజర్ ముగుస్తుంది