సోషల్ మీడియాలో వైరల్ మారిన రామ్ “రెడ్” మూవీ ట్రైలర్…

“పతయే మే కౌన్ హూ శంకర్ ఇస్మార్ట్ శంకర్” అంటూ ఊర మాస్ డైలాగ్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మళ్లీ “రెడ్” అనే కొత్త సినిమాతో
ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయినప్పటికీ కరోనా దృష్ట్యా విడుదల కాలేకపోయింది. ఈ కరోనా కాలంలో ఎన్ని పెద్ద పెద్ద చిత్రాలు ఓటీటీలో రిలీజైన..తాము మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయమని సినిమా థియేటర్ లో నే విడుదల చేస్తామని రెడ్ చిత్ర బృందం నిర్మొహమాటంగా తేల్చిచెప్పింది.ఈ మేరకు సినిమా థియేటర్లు ప్రారంభం కావడంతో రెడ్ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.దీంతో తాజాగా రెడ్ చిత్రం ట్రైలర్ రిలీజ్ చేశారు.

ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే హీరోయిన్లుగా నివేదా పేతురాజు, మాళవిక శర్మ, అమృత అయ్యర్ నటించారు. ఈ చిత్రానికి మణి శర్మ సంగీతం అందించారు. తమిళ్ లోని “తడమ్” అనే చిత్రానికి రీమేక్ గా రెడ్ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ లో లో రామ్ యాక్టింగ్, డాన్సులతో ఇచ్చి పడేసిండు.. దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రైలర్ వైరల్ గా మారింది