Today Telugu News Updates
సొంత మరదలినినే వ్యభిచార కూపంలోకి దింపిన…వదిన !

కందుకూరు లో గతం లో జరిగిన మైనర్ బాలిక తో వ్యభిచారం చేయించిన సంఘటనలో మరో విషయం బయట పడింది. సొంత మరదలిని తన వదిన వ్యభిచార గృహానికి అమ్మినట్టుగా పోలీసులు గుర్తించారు.
దీనికి సంబదించిన పూర్తీ వివరాలను పోలీసులు వెల్లడిస్తూ…. నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఒక మైనర్ బాలిక 10 వరకు చదువుకొని ఇంటివద్దనే ఉంటుంది. బాలిక తల్లిదండులమధ్య సరిఅయిన సంబందాలు లేకపోవడంతో ఆ బాలిక తన అన్న ఇంట్లో ఉంటుంది.
బాలిక అన్నకీ తెలియకుండా అన్న భార్య(వదిన) వ్యభిచార గృహం నడిపే మాదవి అనే మహిళకు అమ్మేసింది. ఆ మహిళా వద్ద 5 రోజులకు గాను 27 వేయిల రూపాయలు తీసుకుందని పోలీసులు తెలిపారు.
మాదవి తన దందాలు ఇతర ప్రాంతాలలో కూడా చేస్తున్నారని పోలీసులు గుర్తించారు.
వీరి వద్ద దొరికిన ఫోన్ కాల్స్, బ్యాంకు లావాదేవీలను పరిశీలించి 9 మందిని అదుపులోకి తీసుకున్నారు.