Today Telugu News Updates
సెప్టెంబర్ 1st నుండి ఆన్ లైన్ పాఠాలు ప్రారంభం:-

ఈ నెల 5న జరిగిన కేబినెట్ బేటీ లో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు సెప్టెంబరు 1st నుంచి ఆన్ లైన్ క్లాసులు జరుగుతాయని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ పాఠాలను దూరదర్శన్ యాదగిరి ఛానల్, టీశాట్ ఛానళ్ల ద్వారా డిజిటల్ పాఠాలను ప్రసారం చేయాలనీ ఆదేశించారు .
కేంద్ర ప్రభుత్వ సాధారణ తరగతుల ప్రారంభంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ,ప్రస్తుతం పాఠశాల విద్యాశాఖలోని ఎస్సీఈఆర్టీ తయారు చేసిన ప్రత్యామ్నాయ క్యాలెండర్ను అనుసరించాలని పేర్కొన్నారు.
ఈ నెల 27నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయులందరూ పాఠశాలల విధుల్లోకి వెళ్లాలని, డిజిటల్ పాఠాల తయారీ, పాఠాల ప్రణాళికలు తాయారు చేయాలని ఉత్తర్వులు జారీ చేసారు.