సినిమా :- toofan (2021)

సినిమా :- toofan (2021)
నటీనటులు :- ఫర్హాన్ అఖ్తర్, పరేష్ రావల్ , మృణాల్ ఠాకూర్.
నిర్మాతలు:- : రితేష్ సిద్వానీ ఫర్హాన్ అఖ్తర్
డైరెక్టర్ :- రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా
లాక్డౌన్ సమయం లో ప్రజలకి ఓ టీ టీ ద్వారా విడుదలయే సినిమాలు అలరిస్తూ వస్తున్నాయి. ఇపుడు తూఫాన్ అనే సినిమా అదే తరహా లో ప్రేక్షకులని అలరించడానికి వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉందొ ఇపుడు మనం చూద్దాం.
toofan movie story:-
ఈ కథ ముంబై లోని డోంగ్రి ప్రదేశం లో మొదలవుతుంది. అక్కడే చిన్న చిన్న దందాలు చేస్తూ గ్యాంగ్ స్టర్ గా పేరు సంపాదిస్తాడు అజిజ్ అలీ(ఫర్హాన్ అఖ్తర్). అయితే కాలానుసారం అజిజ్ అలీ కి తన స్నేహితుడి వలన బాక్సింగ్ పైన ఆశక్తి కలుగుతుంది. అప్పటినుంచి దందాలు, కొట్లాటలు మానేసి బాక్సింగ్ పైన శ్రద్ద పెడతాడు , కానీ అతనికి మంచి ట్రైనింగ్ ఇచ్చే కోచ్ కావాలి , కోచ్ గా పనిచేస్తున్న ప్రభు (పరేష్ రావల్) కి ముస్లిమ్స్ అంటే అస్సలు నచ్చదు. ఇపుడు అలీ , ప్రభు ని కోచ్ గా ఉండటానికి ఎలా ఒప్పిస్తాడు ? అలీ బాక్సింగ్ కోసం పడిన కష్టాలు ఏంటి ? చివరికి అలీ బాక్సింగ్ రింగ్ మెట్లు ఎక్కగలిగాడా లేదా ? ఇవ్వని తెలుసుకోవాలంటే సినిమా అమెజాన్ ప్రైమ్ లో చూసేయాల్సిందే.
toofan Movie highlights👍🏻:-
- ఎప్పటిలాగే ఫర్హాన్ అఖ్తర్ సాలిడ్ పెర్ఫార్మన్స్ తో ప్రేక్షకులని అలరిస్తాడు కానీ ఈ సినిమాకి అందరికంటే కోచ్ గా చేసిన పరేష్ రావల్ యొక్క నటన ఎప్పటికి గుర్తుండిపోయేయలా ఉంటుంది.
- మృణల్ థాకూర్ తన పాత్రా కు న్యాయం చేసింది.
*సినిమాటోగ్రఫీ చాల బాగుంది ముంబై నగరాన్ని ఎపుడు చూడని విధంగా చక్కగా చూపించారు.
- బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.
- నిర్మాణ విలువలు చాల బాగున్నాయి.
*డైరెక్టర్ ఈ సినిమాకి తన ప్రాణం పెట్టి తీసాడనే చెప్పాలి.
*ప్రతి సన్నివేశంలో వచ్చే అద్భుతమైన మాటలు ఈ సినిమాని చిరకాలం గుర్తుండిపోయేలా చేస్తాయి.
toofan Movie Minus Points👎🏻:-
- కధనం చాల స్లో గా ఉంటుంది.
- దర్శకుడు ప్రతిదీ చుపించాలనుకొని సినిమా యొక్క నిడివి ని చాల పెద్దగా చేసేశారు.
*కొని సన్నివేశాలు బోర్ కొడుతాయి.
- పాటలు అంతగా అలరించవు.
ముగింపు :-
మొత్తానికి తూఫాన్ అనే సినిమా ఒక ఆశయం మనసులో సంకల్పిస్తే అది సాధించడానికి ఎంత కష్టం అయినా భరించాలి అని దర్శకుడు చెప్పకనే చెప్పాడు. సినిమాలో బాక్సింగ్ సన్నివేశాలు కన్నా కోచ్ మరియు ఆలీ మధ్య జరిగే సంభాషణే మనసుని కదిలిస్తాయి. కథ మరియు కధనం పాతదే అయినా సినిమా చుస్తునంతసేపు ఎక్కడ విసుగు తెపియదు. మొత్తానికి ఈ వారం తూఫాన్ సినిమా కుటుంబసమేతంగా హ్యాపీ గా ఓసారి చూసేయచ్చు.
toofan rating:- 2.5/5