Today Telugu News Updates
సితార ,నమ్రత ల నుండి స్పెషల్ బర్త్ డే విషెష్ అందుకున్న హీరో మహేష్ బాబు :-

టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు వేడుకలను అభిమానులు కోవిద్ నిబంధనలను పాటిస్తూ పండగల జరుపుకున్నారు .
మహేష్ బాబుకు కొంత మంది సినీ మరియు రాజకీయ ప్రముఖులు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు , అదేవిదంగా మహేష్ భార్య నమ్రత , కూతురు సితార కూడా ఎంతో స్పెషల్ గా మహేష్ కు శుభాకాంక్షలు తెలియజేసారు .
నిజమైన ప్రేమ అనేది నేను మీలో చూసాను , అదే ప్రేమను నేను నీపై ఎల్లపుడు చూపిస్తాను అని నమ్రత తనను ముద్దు పెట్టుకుంటున్న ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది .
అలాగే మహేష్ కూతురు సితార కూడా ఈ రోజు తనకెంతో ఇష్టమైన రోజు అని , ఈ రోజుని మేము మా నాన్నతో ఒక పండగలాగా జరుపుకుంటామని చెప్పుకొచ్చి మహేష్ కి హ్యాపీ బర్త్ డే తెలియజేసింది .