సహాయ శిబిరానికి వెళదామంటే కరోనాభయం … ఊరిలోనే ఉందామంటే వరదల భయం… :-
ఇరిగేషన్ అధికారులు 2006 తర్వాత ఇవే అతి పెద్ద వరదలుగా చెబుతున్నారు. ఎగువన ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానలతో కోనసీమ గ్రామాలను ముంపునకు గురి అవుతున్నాయని , ఇప్పటికే వందలతో గ్రామాల్లో గోదావరి నీరు చేరింది.
పోలవరం ముంపు గ్రామాల్లో పరిస్థితి దారుణంగా మారింది. ప్రభుత్వ ఇప్పటి వరకు ఎలాంటి సహాయం చేయలేదని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ప్రజలు వాపోతున్నారు. వరదల్లో చిక్కుకున్న వారికి తగిన సహాయం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వర్షాల వల్ల నదులు ,వాగులు,వంకలు పొగి పొర్లుతున్నాయి. ముఖ్యంగా గోదావరి ఉపనదుల నుంచి భారీగా వరదలు వచ్చి చేరుతున్నాయి. దాంతో గోదావరి నది నిండుగా మారింది.
భద్రాచలం వద్ద 58.1 అడుగులకు చేరింది. పై నుండి వస్తున్న వరదల ను సముద్రంలోకి వదిలేందుకు ధవళేశ్వరం బ్యారేజ్ అధికారులు ఏర్పాట్లు చేశారు.

ఈ వరదలు ఇంకా పెరిగే అవకాశం ఉందని, సాయంత్రం తరువాత ఈ వరదలు తగ్గుముఖం పట్టవచ్చు అని అధికారులు చెపుతున్నారు.