సంపు కి ఇంత గోల్డ్ ఎక్కడిది?

సంపు అంటే ఒక నేమ్ కాదు ఒక బ్రాండ్ అనే లా ఒక పేరు సంపాదించాడు, ఎక్కడో మారుమూల ప్రాంతం నుండి వచ్చి హీరో అవటం అది ఒక సక్సెస్స్ ఫుల్ హీరో అంటే మామూలు విషయం కాదు, ఇప్పటికీ సంపు 2 హిట్స్ అయితే తన ఖాతాలో వేసుకున్నాడు, మొదటి సినిమాతో హృదయ కాలేయం – హిట్, రెండో సినిమా – కొబ్బరి మట్ట హిట్ ఇలా వరుసగా రెండు హిట్స్ సంపాదించాడు. ఇక తన కెరీర్ ఎపుడు ఎలా ముందు ముందు ఉంటుందో తెలీదు గాని జనాలలో ఒక మేరకు తన మార్క్ కామెడీ ఇష్టపడే లా చేసుకున్నాడు, అలాగే డైలాగు లు బాగా చెబుతాడు. తాను డైరెక్టర్ ఆర్టిస్ట్ తో పాటు ప్రొడ్యూసర్స్ ఆర్టిస్ట్ అనే పేరుంది , అలాగే మంచి మానవత్వం కలవాడిగా కూడా పేరుంది.
ఇక రాబోయే సినిమా పేరు గోల్డ్ మ్యాన్, ఈ పోస్టర్ లో సంపు ఒంటి నిండా గోల్డ్ నే ఇది యాక్షన్ కామెడీ తరహా సినిమా అని తెలుస్తుంది, ఇక ఈ సినిమా కూడా తన హిట్ సినిమా తరహా అలరిస్తుందని ఆశిద్దాం.