Today Telugu News Updates

సంచలన నిర్ణయం తీసుకోనున్నా మోడీ

ఒక దేశం – ఒకేసారి ఎనికలు ‘ ఒక దేశం – ఒకేసారి ఎన్నికలు ‘ ఆవశ్యకతను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మళ్లీ తెరపైకి తెచ్చారు . గతవారం అఖిల భారత ప్రిసైడింగ్ ఆఫీస ర్ ( చట్టసభల అధ్యక్షులు ) 80 వ మహాసభలో ప్రధాని ప్రసంగిస్తూ , ప్రతి సంవత్సరం దేశంలో ఎక్కడో ఒక చోట ఎన్నికల వల్ల ధనం వృధా కావట మేగాక , ప్రభుత్వాలు అభివృద్ధిపై కేంద్రీకరించి పనిచేయలేక పోతు న్నాయన్నారు . అందువల్ల లోక్ సభ , రాష్ట్ర అసెంబ్లీలు , పట్టణ , గ్రామీణ స్థానిక సంస్థలకు ఒకే రోజు ఎన్నికలు నిర్వహిస్తే ప్రభుత్వాలు ఎన్నికల బాదరబందీ లేకుండా ఐదేళ్లు ‘ సుపరిపాలన ‘ అందించే అవకాశముంటుం దన్నారు . వచ్చే ఏడాది ( 2021 ) సార్వత్రిక ఎన్నికలు రావొచ్చని అడపాద డపా వినిపిస్తున్న ఊహాగానాలకు ప్రధాని ప్రసంగం బలం చేకూర్చుతు న్నది . బిజెపి కేంద్రంలో , అత్యధిక రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చాక ‘ ఒక ఒకే పన్ను ‘ పేరుతో జిఎటి ప్రవేశపెట్టింది .

ప్రతిపక్షంలో ఉండగా అది దీన్ని వ్యతిరేకించింది . అలాగే ఒక దేశం – ఒక వ్యవసాయ మార్కెట్ పేరుతో గత సెప్టెంబర్ లో పార్లమెంటులో ప్రతిపక్షాల అభ్యంత రాలను తోసిపుచ్చి రెండు వ్యవసాయ మార్కెట్ చట్టాలు , వినియోగదారుల చట్టానికి ఒక సవరణ తెచ్చింది . అవి వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధర , ప్రభుత్వ కొనుగోలు గ్యారంటీ లేకుండా వ్యవసాయ మార్కెట్లను బడా వ్యాపారుల పాల్గేస్తున్నాయి . ఆహారోత్పత్తుల రిటైల్ వ్యాపారంలో ప్రవేశించిన కార్పొరేట్లతో కాంట్రాక్టు వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాయి . వినియోగదారుల చట్ట సవరణ ద్వారా వ్యాపారుల వద్ద సరుకు నిల్వలపై పరిమితులు ఎత్తివేసింది . ఈ కార్పొరేట్ అనుకూల , అన్నదాత వ్యతిరేక నల్లచట్టాలకు వ్యతిరేకంగా దేశ రైతాంగం , ముఖ్యంగా ఉత్తరాది రైతాంగం కేంద్రప్రభుత్వంతో పోరాటం చేస్తున్నారు . మనం నాల్గు రోజు లుగా ఢిల్లీ సరిహద్దుల్లో చూస్తున్న సంఘర్షణ ఇదే ..

రాజకీయంగా కూడా ఏకఛత్రాధిపత్యాన్ని కోరుకుంటున్న బిజెపి తమ పాలన నల్లేరుపై నడకలా సాగేందుకు ఏకకాల ఎన్నికలు కోరుకుంటున్నది . ఇది అనేక రాజ్యాంగ చిక్కులతో కూడిన అంశం . గత నాలుగేళ్లుగా అప్పుడప్పుడు ఈ అంశాన్ని లేవనెత్తుతున్న ప్రధానమంత్రి వాటి సాధ్యాసాధ్యాలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించలేదు , రాజ కీయ పక్షాలతో చర్చించలేదు . లోక్ సభ , శాసనసభలకు ఒకసారి ఎన్ని కలు కొత్త కాదు . 1952 నుంచి 1967 వరకు ఎన్నికలు అలాగే జరిగాయి . 1967 లో ఏడెనిమిది రాష్ట్రాల్లో కాంగ్రెస్ గుత్తాధిపత్యం బద్దలై సంయుక్త విధాయక్ దళ్ , ఐక్యసంఘటన వంటి పేర్లతో ప్రతిపక్ష పార్టీల కలయికలతో కాంగ్రెస్సేతర ప్రభుత్వాలు ఏర్పడటం , అవి వివిధ కారణాలతో వేర్వేరుస మయాల్లో కూలిపోవటం వల్ల రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణ వేర్వేరు సంవ త్సరాల్లో జరిగాయి .

సంచలన నిర్ణయం తీసుకోనున్నా మోడీ

అంతేగాక శాంతి భద్రతల వైఫల్యం , ఇతరత్రా కార ణాలతో ఆర్టికల్ 365 కింద రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణ గతి తప్పింది . అలాగే ఎమర్జెన్సీ అనంతరం 1977 లోకసభ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన జనతా పార్టీ ప్రభుత్వం 7 కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయటం , 1980 లో ఇందిరాగాంధీ తిరిగి అధికారం లోకి వచ్చాక అదే రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయటం , ఆయారాం గయా రాంలతో ప్రభుత్వాలు మారటం , కూలిపోవటం , 1994 తదుపరి సంకీర్ణ ప్రభుత్వ రాజకీయాలు అనివార్యం కావటం – ఇట్లాంటి అనిశ్చిత పరిస్థి తుల్లో ఎన్నికల నిర్వహణ కాలాలు తారుమారవుతూ వచ్చాయి . 2014 లోక్ సభ ఎన్నికల్లో కేంద్రంలో బిజెపి నాయకత్వంలో ఎన్ఎఎ అధికారం లోకి రావటంతో భారతదేశ రాజకీయాల్లో సంకీర్ణ రాజకీయ శకం ముగి సినట్లు అంచనాకు వచ్చింది .

2019 ఎన్నికల్లో బిజెపికే ఒంటరిగా సంపూర్ణ ఆధిక్యత లభించటంతో ఆ నిర్థారణ బలపడింది . వాస్తవానికి , న్యాయమంత్రిత్వ శాఖపై స్టాండింగ్ కమిటీ 2015 లో ‘ ఏకకాల ఎన్నికలకు ఆచరణాత్మక పద్ధతి ‘ సిఫారసు చేసింది . 2018 లో లా కమిషన్ స్వీడన్ , దక్షిణాఫ్రికా , బెల్జియం నమూనాలో ఎన్నికల పద్ధతి ప్రతిపాదిస్తూ కొన్ని సిఫారసులు చేసింది . స్వీడన్లో ప్రతి నాలుగేళ్లకు సార్వత్రిక ఎన్నికలతోపాటు కౌంటీ , మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయి . దక్షిణాఫ్రికాలో ఐదేళ్లకొకసారి అదే పద్ధతిలో జరుగుతాయి . కాగా బెల్జియం పార్లమెంటు ఎన్నికలు ప్రతి ఐదేళ్లకు యూరోపియన్ పార్లమెంటు ఎన్నికలతోపాటు జరుగుతాయి .

లోకసభ ఐదేళ్ల పదవీకాలంలో ప్రతి సంవత్సరం కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల వల్ల ప్రభుత్వాలు , రాజకీయ పార్టీలు నిరం తరం ఎన్నికల మనోగతంతో వ్యవహరించాల్సి వస్తున్న మాట నిజం . కాని ఈ పరిస్థితిని అధిగమించి చట్టసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహిం చటానికి గల రాజ్యాంగ అవరోధాలను అధిగమించటం ఎలా ? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న . వాజ్ పేయి ప్రభుత్వంలో ఉప ప్రధానిగా ఉన్న ప్పుడు ఎల్‌కె అద్వానీ ఒక ఆలోచనను ప్రతిపాదించారు . అది జర్మన్ పద్ధతి . ప్రభుత్వాలతో నిమిత్తం లేకుండా చట్టసభ పదవీ కాలం ఐదేళ్లు స్థిరంగా ఉంటుంది . ప్రభుత్వాలు ఏర్పాటు చేయటం , నడుపు కోవటం రాజకీయ పార్టీల విధి . కొందరు సమర్థించినా అది ఆనాడు విస్తృత ఆమో దానికి నోచుకోలేదు .

నరేంద్రమోడీ పునరుద్ఘాటన ప్రకారం లోకసభతోపాటు శాసనసభల ఎన్నికల జరగాలంటే కొన్ని ప్రభుత్వాల పదవీకాలం కుదింపు , మరికొ న్నింటి పొడిగింపు అవసరం . ఇందుకు పెద్దగా రాజ్యాంగ కసరత్తు అవ సరం . ఏ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు సమ్మతించకపోయినా చేయ గలిగిందేమీ లేదు . ఫెడరల్ వ్యవస్థ స్థానంలో యూనిటరీ వ్యవస్థ ( అధ్యక్ష తరహా పాలన ) కోరుకునే బిజెపి – ఆర్ఎస్ఎస్ ఉద్దేశాల పట్ల రాజకీయ పక్షాల్లో సందేహాలు లేకపోలేదు . ఏటా ఎన్నికలవల్ల ధనం , సమయం వృధా అంటే సరిపోదు . రాజ్యాంగం మౌలిక స్వరూపంలో అంతర్భాగమైన పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి భంగం కలగని రీతిలో ఏకకాల ఎన్నిక లపై విస్తృత చర్చ అవసరం .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button